కాంగ్రెస్‌కు మాజీ మంత్రి రాజీనామా

హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ అగ్రనేత శంకర్‌రావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన వారిని కాంగ్రెస్ విస్మరించిందని, పైరవీకారులకు టికెట్లు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. బిసి,ఎస్‌సి,ఎస్‌టిల కాంగ్రెస్ ప్రస్తుతం రెడ్ల కాంగ్రెస్‌గా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాలకు కాంగ్రెస్‌లో తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేశానని తెలిపారు. శంకర్‌రావు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ టికెట్ ఆశించి […]

హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ అగ్రనేత శంకర్‌రావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన వారిని కాంగ్రెస్ విస్మరించిందని, పైరవీకారులకు టికెట్లు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. బిసి,ఎస్‌సి,ఎస్‌టిల కాంగ్రెస్ ప్రస్తుతం రెడ్ల కాంగ్రెస్‌గా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాలకు కాంగ్రెస్‌లో తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేశానని తెలిపారు. శంకర్‌రావు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.

Ex Minister Shanker Rao Resignation to Congress

Related Stories: