రోహిత్ శర్మను నిలువరించలేం:మాక్స్‌వెల్

సిడ్నీ: టిమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మని పరుగులు చేయకుండా నిలువరించలేమని ఆసిస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వె ల్ పేర్కొన్నాడు. భారత్‌తో సిరీస్ సుదీర్ఘ సిరీస్ ఆడనున్న నేపథ్యంలో.. తాజాగా మాక్స్‌వెల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా భారత ఓపెనర్ రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ.. రోహిత్ శర్మ పేస్, స్పిన్ బౌలింగ్‌లోనూ సమర్థంగా బంతిని స్టాండ్స్‌లోకి తరలించగలడని, అతను బ్యాటింగ్ చేస్తుంటే పరుగులు చేయడం ఇంత సులవా..? అనిపిస్తుందని  అన్నాడు.  మ్యాచ్‌ గమనానికి అనుగుణంగా అతను అలవోకగా సిక్సర్లు బాదగలడని, పరుగులు […]

సిడ్నీ: టిమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మని పరుగులు చేయకుండా నిలువరించలేమని ఆసిస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వె ల్ పేర్కొన్నాడు. భారత్‌తో సిరీస్ సుదీర్ఘ సిరీస్ ఆడనున్న నేపథ్యంలో.. తాజాగా మాక్స్‌వెల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా భారత ఓపెనర్ రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ.. రోహిత్ శర్మ పేస్, స్పిన్ బౌలింగ్‌లోనూ సమర్థంగా బంతిని స్టాండ్స్‌లోకి తరలించగలడని, అతను బ్యాటింగ్ చేస్తుంటే పరుగులు చేయడం ఇంత సులవా..? అనిపిస్తుందని  అన్నాడు.  మ్యాచ్‌ గమనానికి అనుగుణంగా అతను అలవోకగా సిక్సర్లు బాదగలడని, పరుగులు చేయకుండా రోహిత్‌ శర్మని నిలువ రించడం కష్టమని మాక్స్‌వెల్ చెప్పుకొచ్చాడు.

భారత్ జట్టు ఈ నెల 21 నుంచి ఆసిస్తో మూడు టి20లు, 4 టెస్టులు, 3 వన్డేల సుదీర్ఘ సిరీస్‌ని ఆడనుంది. టిమిండియా ఇప్పటి వరకూ కనీసం ఒక్క టెస్టు సిరీస్‌ని కూడా ఆస్ట్రేలియా గడ్డపై గెలవలేకపోయింది. దీంతో ఈ పర్యటనలోనైనా సిరీస్‌ని చేజిక్కించు కోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ‘హిట్ మాన్’ రోహిత్ శర్మ కూడా సూపర్ ఫామ్‌లో ఉండటం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. ఇక 9 నెలలు తర్వాత మళ్లీ టెస్టులు ఆడబోతున్న రోహిత్ ఎలా రాణిస్తోడో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

You can’t stop Rohit Sharma says Glenn Maxwell

Related Stories: