రఫేల్‌ ఒప్పందంపై ప్రధానికి రాహుల్‌ సవాల్‌

రాయ్‌పూర్‌: దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన స్వార్థపు పని వల్ల అమాయక ప్రజల ఎంతో బాధపడుతున్నారని..పెద్దనోట్ల రద్దు చేసి అంతకంటే పెద్ద నోటునే తీసుకువచ్చారని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు.ఆదివారం  ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌ కాంగ్రెస్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పెద్దనోట్ల రద్దు వల్ల దేశానికి ఏం లాభం చేకూరింది?… రైతు రుణ మాఫీకి బదులు ధనవంతుల రుణాలు మాఫీ చేశారని మండిపడ్డారు. […]

రాయ్‌పూర్‌: దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన స్వార్థపు పని వల్ల అమాయక ప్రజల ఎంతో బాధపడుతున్నారని..పెద్దనోట్ల రద్దు చేసి అంతకంటే పెద్ద నోటునే తీసుకువచ్చారని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు.ఆదివారం  ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌ కాంగ్రెస్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పెద్దనోట్ల రద్దు వల్ల దేశానికి ఏం లాభం చేకూరింది?… రైతు రుణ మాఫీకి బదులు ధనవంతుల రుణాలు మాఫీ చేశారని మండిపడ్డారు.

రఫేల్‌ ఒప్పందం విషయంలో జరిగిన అవకతవకల గురించి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాని, 15నిమిషాల పాటు రఫేల్‌ అంశంపై చర్చించే ధైర్యం ప్రధానికి ఉందా? అంటూ మోడీకి సవాల్ విసిరారు. నియమాల ప్రకారం రఫేల్‌ విషయంలో ప్రధాని నడుచుకోలేదని, సిబిఐ డైరెక్టర్‌ను అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో తొలగించిన చోద్యాన్ని మీరెక్కడైనా చూశారా?… కానీ మన ప్రధాని అది చేసి చూపించారని ఎద్దేవా చేశారు. దేశంలోనే అత్యంత ఉన్నత విచారణ సంస్థ అయిన సిబిఐ కీర్తి ప్రతిష్ఠలు ఇలా అవ్వడానికి కారణం భాజపా విధానాలేనని తీవ్ర ఆరోపనలు చేశారు. సుప్రీం, ఆర్బిఐ వంటి వ్యవస్థలనూ భాజపా సర్వ నాశనం చేసిందని రాహుల్ నిప్పులు చెరిగారు. భారత చరిత్రలో న్యాయవాదులే మీడియా ముందుకు వచ్చిన ఘటన గురించి మీకందరికీ తెలిసిందేనని, న్యాయవ్యవస్థకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. నా ప్రశ్నలకు మోడీ దగ్గర సమాధానం లేదని, ఒక వేళ ఉన్నా ఆయన నాముందుకొచ్చి ధైర్యంగా మాట్లాడలేరు’ అని రాహుల్‌ విమర్శించారు.

Rahul Gandhi speech at chhattisgarh election campaign

Related Stories: