గాంధీభవన్ ఎదుట యాదవుల ఆందోళన

హైదరాబాద్ : గాంధీభవన్ ఎదుట యాదవులు ఆందోళనకు దిగారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యాదవులకు కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే కేటాయించిందంటూ వారు ఆ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాదవులకు ఐదు సీట్లు కేటాయించాలని వారు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేస్తామని వారు హెచ్చరించారు. టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా సీట్ల కేటాయింపులో బిసిలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని […]

హైదరాబాద్ : గాంధీభవన్ ఎదుట యాదవులు ఆందోళనకు దిగారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యాదవులకు కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే కేటాయించిందంటూ వారు ఆ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాదవులకు ఐదు సీట్లు కేటాయించాలని వారు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేస్తామని వారు హెచ్చరించారు. టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా సీట్ల కేటాయింపులో బిసిలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని కాంగ్రెస్ అగ్రనేత వి.హన్మంతరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ మహాకూటమి విజయానికి కాంగ్రెస్ కార్యకర్తలు, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు పని చేయాలని హన్మంతరావు విజ్ఞప్తి చేశారు.

Yadavs Protest at Gandhi Bhavan in Hyderabad

Related Stories: