బాలిక బలవన్మరణం..!

హైదరాబాద్: రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. తోటి పిల్లలతో టూర్‌కు పంపలేదని మనస్తాపంతో ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. స్థానిక ఖాజాగూడ చిత్రపురి కాలనీ ఎల్‌ఐజిలో నివాసముండే రామకృష్ణ కుమార్తె అమూల్య(15) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పని నిమిత్తం బయటకు వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి అమూల్య ఫ్యాన్‌కు వెలాడుతూ కనిపించింది. దీంతో హుటాహుటిన బాలికను కుటుంబీకులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, బాలిక అప్పటికే […]

హైదరాబాద్: రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. తోటి పిల్లలతో టూర్‌కు పంపలేదని మనస్తాపంతో ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. స్థానిక ఖాజాగూడ చిత్రపురి కాలనీ ఎల్‌ఐజిలో నివాసముండే రామకృష్ణ కుమార్తె అమూల్య(15) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పని నిమిత్తం బయటకు వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి అమూల్య ఫ్యాన్‌కు వెలాడుతూ కనిపించింది. దీంతో హుటాహుటిన బాలికను కుటుంబీకులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, బాలిక అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు అక్కడికి చేరుకొని బాలిక మృతిపట్ల ఆమె తల్లిదండ్రులను విచారించగా… తోటి పిల్లలతో పాటు టూర్‌కు పంపలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

15 Year Old Girl Commits Suicide in Hyderabad

Telangana Breaking News

Related Stories: