‘సాహో’ విడుదల తేదీ ఫిక్స్

హైదరాబాద్: ‘బాహుబలి’తో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. దీంతో ఆయన తరువాతి చిత్రం ‘సాహో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి క్రేజ్ తో ప్రభాస్‌కు ఇంటర్నెషనల్ స్థాయిలో మార్కెట్‌ ఏర్పడింది. దాంతో సాహోను కూడా అదే స్థాయిలో ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ మూవీ మేకింగ్‌ వీడియోకు మంచి స్పందన రావడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇక గత ఏడాదిన్నర కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న […]

హైదరాబాద్: ‘బాహుబలి’తో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. దీంతో ఆయన తరువాతి చిత్రం ‘సాహో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి క్రేజ్ తో ప్రభాస్‌కు ఇంటర్నెషనల్ స్థాయిలో మార్కెట్‌ ఏర్పడింది. దాంతో సాహోను కూడా అదే స్థాయిలో ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ మూవీ మేకింగ్‌ వీడియోకు మంచి స్పందన రావడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇక గత ఏడాదిన్నర కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్‌ చేస్తున్నారట. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాహో‘లో డార్లింగ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. బాలీవుడ్ సంగీత త్రయం శంకర్-ఎసాన్-లాయ్ బాణీలు అందిస్తున్నారు.

Saaho Release Date Confirmed

Telangana Breaking News

Related Stories: