ఆరనీకుమా నీ దీపం కార్తీక దీపం

“కార్తీక శుద్ధ పౌర్ణమి” లేదా ‘కార్తీక పున్నమి’ అంటే కార్తీక మాసంలో శుక్ల పక్షంలో పౌర్ణమి తిథి కల్గిన 15వ రోజు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైందిగా భావిస్తారు. విశిష్టత: కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైందని పురాణాలు చెబుతున్నాయి. మహా పవిత్రమైన ఈ రోజున నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలా తోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వపాపాలూ ప్రక్షాళనమవుతాయి. ఈ పౌర్ణమి రోజున నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి, […]

“కార్తీక శుద్ధ పౌర్ణమి” లేదా ‘కార్తీక పున్నమి’ అంటే కార్తీక మాసంలో శుక్ల పక్షంలో పౌర్ణమి తిథి కల్గిన 15వ రోజు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైందిగా భావిస్తారు.

విశిష్టత: కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైందని పురాణాలు చెబుతున్నాయి. మహా పవిత్రమైన ఈ రోజున నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలా తోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వపాపాలూ ప్రక్షాళనమవుతాయి. ఈ పౌర్ణమి రోజున నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించడం సాక్షాత్తూ ఆ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదట! ఈ రోజున ఉపవాసంతో శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించి ఆలయంలో మట్టిప్రమిదల్లో 365 వత్తులను ఆవునేతితో వెలిగిస్తే సమస్త పాపాలూ తొలగిపోయి, సుఖసంతోషాలను అనుభవిస్తారని ఇతివృత్తాలు తెలియజేస్తున్నాయి.

ఇందులో భాగంగా…మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే, కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అంతే కాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం చేస్తే చాలా మంచి జరుగుతుంది. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పం, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది. దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతఃకాలాన (వేకువ జామున) స్నానం చేయాలి. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని, చెరువులో గాని, స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఈ కింది శ్లోకం చదవాలి.

శ్లో॥ గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలే…స్మిన్ సన్నిధింకురు॥

Karthika Pournami Pooja

Telangana news