‘కాంగ్రెసోళ్లది జలయజ్ఞం కాదు.. ధనయజ్ఞం’

వరంగల్: వరంగల్‌కు ఐఐఎం తీసుకొస్తామని మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వరంగల్‌లో కడియం ప్రచారం నిర్వహించారు. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్ పార్క్ నిర్మాణం జరుగుతుందన్నారు. దేవాదుల ప్రాజెక్టు ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయిని అని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా అడ్డుకున్న ఎపి సిఎం చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. మహాకూటమితో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతుందన్నారు. ప్రాజెక్టులకు ప్రతి బడ్జెట్‌లో […]

వరంగల్: వరంగల్‌కు ఐఐఎం తీసుకొస్తామని మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వరంగల్‌లో కడియం ప్రచారం నిర్వహించారు. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్ పార్క్ నిర్మాణం జరుగుతుందన్నారు. దేవాదుల ప్రాజెక్టు ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయిని అని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా అడ్డుకున్న ఎపి సిఎం చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. మహాకూటమితో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతుందన్నారు. ప్రాజెక్టులకు ప్రతి బడ్జెట్‌లో రూ. 25 వేల కోట్లు కేటాయించామని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాజెక్టులకు నిర్మాణాలే చేపట్టలేదని దుయ్యబట్టారు.

గతంలో కాంగ్రెస్ నాయకులు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకున్నారని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రాజెక్టు నిర్మిస్తుంటే కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారని కడియం దుయ్యబట్టారు. ప్రముఖ ఐటి కంపెనీలు హైదరాబాద్‌కు వస్తుండడంతో దేశంలో భాగ్యనగరం ఐటి ఎగుమతుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు. రైతు బీమా, రైతు బంధు పథకంలో రైతులను ఆదుకున్నామని, 40 లక్షల కుటుంబాలకు ఆసరా పెన్షన్లు ఇస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు టిఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసి కెసిఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని కోరారు.

Telangana Elections: Kadiyam Comments on Mahakutami

Telangana news

Related Stories: