మైనార్టీల సంక్షేమమే ధ్యేయం

వికారాబాద్ : మైనార్టీల సంక్షేమమే తమ ధ్యేయమని మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ నియోజకవర్గ టిఆర్‌ఎస్ అభ్యర్థి మెతుకు ఆనంద్‌కు మద్ధతుగా ఆదివారం మంత్రి కోట్‌పల్లి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నాలుగున్నరేళ్ల తన పాలనలో కెసిఆర్ మైనార్టీల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు కేటాయించారని ఆయన పేర్కొన్నారు. ముస్లింల పిల్లల కోసం రాష్ట్రంలో 204 మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఇద్గాల కోసం నిధులు, ఇమాంలకు జీతాలు, […]

వికారాబాద్ : మైనార్టీల సంక్షేమమే తమ ధ్యేయమని మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ నియోజకవర్గ టిఆర్‌ఎస్ అభ్యర్థి మెతుకు ఆనంద్‌కు మద్ధతుగా ఆదివారం మంత్రి కోట్‌పల్లి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నాలుగున్నరేళ్ల తన పాలనలో కెసిఆర్ మైనార్టీల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు కేటాయించారని ఆయన పేర్కొన్నారు. ముస్లింల పిల్లల కోసం రాష్ట్రంలో 204 మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఇద్గాల కోసం నిధులు, ఇమాంలకు జీతాలు, మసీదుల అభివృద్ధికి నిధులు , షాదీ ముబారక్ కింద ముస్లిం యువతులకు ఆర్థిక సాయం అందించామని ఆయన తెలిపారు. ఈ ప్రచారంలో ఎంఐఎం తాండూరు నియోజకవర్గం అధ్యక్షుడు అబ్దుల్ హాదీ తదితరులు పాల్గొన్నారు.

Mahender Reddy Election Campaign in Vikarabad

Related Stories: