పంజాబ్‌లో భారీ పేలుడు : ముగ్గురి మృతి

అమృత్‌సర్ : పంజాబ్‌లో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. అమృత్‌సర్ జిల్లా రాజ్‌సన్సి గ్రామంలో నిరంకారి భవన్ వద్ద ఈ పేలుడు సంభవించింది. నిరంకారి తెగ ప్రజలు జరుపుకుంటున్న ఉత్సవాలను టార్గెట్‌గా చేసుకుని దుండగులు ఈ పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. […]

అమృత్‌సర్ : పంజాబ్‌లో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. అమృత్‌సర్ జిల్లా రాజ్‌సన్సి గ్రామంలో నిరంకారి భవన్ వద్ద ఈ పేలుడు సంభవించింది. నిరంకారి తెగ ప్రజలు జరుపుకుంటున్న ఉత్సవాలను టార్గెట్‌గా చేసుకుని దుండగులు ఈ పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో ఉన్న సిసిటివి కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, ఈ ఘటనకు పాల్పడిందెవరో తెలియరాలేదని పోలీసు అధికారి సురీందర్ పాల్ సింగ్ వెల్లడించారు.

Explosion in Punjab : Three People died

Related Stories: