మరో వివాదంలో సల్మాన్

ముంబయి: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలతో  పలుమార్లు వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. ప్రతిరోజు ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేసరికి తన ఒళ్లు హూనం అయ్యేదని, షూటింగ్ ముగిసేసరికి తన పరిస్థితి అత్యాచారానికి గురైన మహిళలా మారేదని సల్మాన్ ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో పేర్కొన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా రాజస్థాన్‌లో కృష్ణజింకలను వేటాడిన కేసు సల్మాన్ జైలు జీవితం కూడా గడిపారు. అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ‘భారత్’ అనే […]

ముంబయి: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలతో  పలుమార్లు వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. ప్రతిరోజు ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేసరికి తన ఒళ్లు హూనం అయ్యేదని, షూటింగ్ ముగిసేసరికి తన పరిస్థితి అత్యాచారానికి గురైన మహిళలా మారేదని సల్మాన్ ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో పేర్కొన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా రాజస్థాన్‌లో కృష్ణజింకలను వేటాడిన కేసు సల్మాన్ జైలు జీవితం కూడా గడిపారు. అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ‘భారత్’ అనే సినిమాలో సల్మాన్ నటిస్తున్నారు. ఈ మూవీలో సల్మాన్ కు జంటగా కత్రినా ఖైఫ్ నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇండో పాక్ బోర్డర్ లో తీయాలి. కానీ అనుమతులు లేకపోవడంతో పంజాబ్ లో సెటింగ్ ను నిర్మించి షూటింగ్ కు జరుపుకుంటున్నారు. భారత్ అనే సినిమా షూటింగ్ లోని ఓ సన్నివేశంలో ఖాన్ పాకిస్తాన్ జెండా ఎగురవేశాడు. జెండా ఎగురవేసిన సీనుపై స్థానిక ప్రజలు వ్యతిరేకించడమే కాకుండా సినిమా బృందంపై కేసు పెట్టారు. దీంతో భారత్ అనే సినిమా వివాదాల్లో చిక్కుకుంది.

Pakistan’s Flag to be Hoisted by Salman in Bharat Film

Telangana news

Related Stories: