మహిళా కానిస్టేబుల్ పై ఎస్ఐ అఘాయిత్యం..!

ముంబయి: నవీ ముంబయి క్రైమ్ బ్రాంచ్ లో ఎస్ఐ(సబ్ ఇన్ స్పెక్టర్)గా విధులు నిర్వహిస్తున్న అమిత్ షెలార్ తోటి మహిళా కానిస్టేబుల్ పై  అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం దాన్ని వీడియో తీసి బెదిరింపులకు పాల్పడుతూ పలుమార్లు లొంగదీసుకున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కానిస్టేబుల్ గా పనిచేస్తున్న 31 ఏళ్ల మహిళను తొలిసారి గత సంవత్సరం మార్చిలో కూల్ డ్రింక్స్ లో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు అమిత్. ఆ ఘటనను వీడియో కూడా తీశాడు. అనంతరం […]

ముంబయి: నవీ ముంబయి క్రైమ్ బ్రాంచ్ లో ఎస్ఐ(సబ్ ఇన్ స్పెక్టర్)గా విధులు నిర్వహిస్తున్న అమిత్ షెలార్ తోటి మహిళా కానిస్టేబుల్ పై  అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం దాన్ని వీడియో తీసి బెదిరింపులకు పాల్పడుతూ పలుమార్లు లొంగదీసుకున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కానిస్టేబుల్ గా పనిచేస్తున్న 31 ఏళ్ల మహిళను తొలిసారి గత సంవత్సరం మార్చిలో కూల్ డ్రింక్స్ లో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు అమిత్. ఆ ఘటనను వీడియో కూడా తీశాడు. అనంతరం దాన్ని చూపించి బెదిరిస్తూ పలుమార్లు తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఇలా సిబిడి, పాన్వెల్, కామోత్, ఖర్ గర్ ప్రాంతాల్లో ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ వీడియోను అంతర్జాలంలో పెడతానని బెదిరిస్తుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు అమిత్ పై పోలీసులు కేసు నమోదు చేయడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

Navi Mumbai Cop booked for raping woman Constable

Telangana Breaking News

Related Stories: