గజ తుఫాను : 45 మంది మృతి

చెన్నయ్ : గజ తుఫాను తమిళనాడును వణికిస్తోంది. గజ తుఫాను కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 45 మంది చనిపోయారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య 45 మందికి పైగానే ఉండొచ్చని తెలుస్తోంది. తుఫాన్ కారణంగా 4730 మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. 1.70 లక్షల చెట్లు నేలకూలాయి. 347 ట్రాన్స్‌ఫార్మర్లు , 39,938 విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. తుఫాను కారణంగా 2.49 లక్షల మందికి ప్రభుత్వం పునరావాసం కలిపించింది. తుఫాను ధాటికి తిరువారూర్ జిల్లా అతలాకుతలైమంది. […]

చెన్నయ్ : గజ తుఫాను తమిళనాడును వణికిస్తోంది. గజ తుఫాను కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 45 మంది చనిపోయారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య 45 మందికి పైగానే ఉండొచ్చని తెలుస్తోంది. తుఫాన్ కారణంగా 4730 మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. 1.70 లక్షల చెట్లు నేలకూలాయి. 347 ట్రాన్స్‌ఫార్మర్లు , 39,938 విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. తుఫాను కారణంగా 2.49 లక్షల మందికి ప్రభుత్వం పునరావాసం కలిపించింది. తుఫాను ధాటికి తిరువారూర్ జిల్లా అతలాకుతలైమంది. తిరువారూర్, నాగపట్నం జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ పర్యటించారు. తుఫాను బాధితులను ఆయన పరామర్శించారు. తుఫాను కారణంగా సంభవించిన ఆస్తి నష్టంపై అంచనా వేసేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మృతల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

45 People died with Cyclone Gaza in Tamil Nadu

Related Stories: