హైదరాబాద్: లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టిన రోజు(ఆదివారం) సందర్భంగా ఆమె నటిస్తున్న భారీ మూవీ ‘సైరా.. నరసింహారెడ్డి’ మోషన్ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘సైరా’ టీం ఫస్ట్ లుక్ పోస్టర్‌తో నయన్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా ‘సైరా’ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ మూవీలో ఆమె ‘సిద్ధమ్మ’ పాత్ర పోషిస్తున్నారు. సిద్ధమ్మ అనే పాత్రలో నయనతార ఎంతో హుందాగా కనిపిస్తుంది. ఉయ్యాలవాడ భార్య పాత్రలో నయనతార నటిస్తోంది. చిరంజీవి-నయనతార మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులకు కనువిందుగా ఉంటాయని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో పాటు జగపతిబాబు, సుధీప్, విజయ్ సేతుపతి, తమన్నా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది స్వరాలు అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై చిరు తనయుడు రాంచరణ్ ‘సైరా‘ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం 2019 వేసవి ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
నయనతార బర్త్‌డే స్పెషల్…(‘సైరా’మోషన్ టీజర్)
హైదరాబాద్: లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టిన రోజు(ఆదివారం) సందర్భంగా ఆమె నటిస్తున్న భారీ మూవీ ‘సైరా.. నరసింహారెడ్డి’ మోషన్ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘సైరా’ టీం ఫస్ట్ లుక్ పోస్టర్‌తో నయన్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా ‘సైరా’ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ మూవీలో ఆమె ‘సిద్ధమ్మ’ పాత్ర పోషిస్తున్నారు. సిద్ధమ్మ అనే పాత్రలో నయనతార ఎంతో హుందాగా కనిపిస్తుంది. ఉయ్యాలవాడ భార్య పాత్రలో నయనతార నటిస్తోంది. చిరంజీవి-నయనతార మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులకు […]