కెసిఆర్ కోసం ఆత్మత్యాగం..!

హైదరాబాద్: కెసిఆర్ మళ్లీ సిఎం కావాలంటూ ఓ వ్యక్తి ఆత్మత్యాగం చేశాడు. నగర శివారులోని కుత్బుల్లాపూర్‌లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కుత్బుల్లాపూర్ ఎంఎల్ఎ వివేక్ ఈసారి మంత్రి కావాలని, కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ కార్యకర్త గురవప్ప బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిజాంపేటలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో తాను సొంతంగా ఏర్పాటు చేసుకున్న పార్టీ కార్యాలయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పంచనామ కోసం […]

హైదరాబాద్: కెసిఆర్ మళ్లీ సిఎం కావాలంటూ ఓ వ్యక్తి ఆత్మత్యాగం చేశాడు. నగర శివారులోని కుత్బుల్లాపూర్‌లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కుత్బుల్లాపూర్ ఎంఎల్ఎ వివేక్ ఈసారి మంత్రి కావాలని, కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ కార్యకర్త గురవప్ప బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిజాంపేటలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో తాను సొంతంగా ఏర్పాటు చేసుకున్న పార్టీ కార్యాలయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పంచనామ కోసం మృతదేహాన్ని దవాఖానకు తరలించారు. కాగా, మృతదేహం పక్కన పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది.

అందులో తనను క్షమించాలని, కెసిఆర్ మళ్లీ సిఎం కావాలని, అలాగే వివేక్ మంత్రి కావాలని గురవప్ప రాసుకున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను ఎనిమిది సార్లు జైలుకు వెళ్లానని, లాఠీ దెబ్బలు తిన్నానని లేఖలో పేర్కొన్నాడు. నాడు తెలంగాణ కోసం శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేశాడని, అప్పట్లో తాను కూడా ఆత్మహత్యకు పాల్పడితే పోలీసులు కాపాడారని తెలిపాడు. తనకు ఇల్లు లేదని, తన భార్యాపిల్లలను ఆదుకోవాలని చెప్పుకొచ్చాడు. అయితే, గురవప్ప ఆత్మహత్యపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడి పాదాలు నేలకు తాకుతున్నాయని, కాబట్టి అది ఆత్మహత్య కాదంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

KCR Fan commits Suicide: Telangana Elections 2018

Telangana Breaking News

Related Stories: