యెస్ బ్యాంక్ సిఇఒ రేస్‌లో 10మంది

ముంబయి: ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యెస్ బ్యాంక్ కొత్త సిఈఓ పదవి రేసులో 5 10 మంది బ్యాంకర్లున్నట్లు తెలుస్తోంది. పిఈఓ ఎంపిక కోసం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీ షార్ట్ లిస్టు చేసిన వారతలో ఒక విదేశీ బ్యాంక్ (ఎంఎన్‌సి) చీఫ్, ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్ అధిపతి,మరి కొన్ని ప్రైవేటు బ్యాంకుల హెడ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. లిస్టులో 5 10 మంది బ్యాంకర్ల పేర్లున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే అంతిమంగా అయిదు మంది […]

ముంబయి: ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యెస్ బ్యాంక్ కొత్త సిఈఓ పదవి రేసులో 5 10 మంది బ్యాంకర్లున్నట్లు తెలుస్తోంది. పిఈఓ ఎంపిక కోసం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీ షార్ట్ లిస్టు చేసిన వారతలో ఒక విదేశీ బ్యాంక్ (ఎంఎన్‌సి) చీఫ్, ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్ అధిపతి,మరి కొన్ని ప్రైవేటు బ్యాంకుల హెడ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. లిస్టులో 5 10 మంది బ్యాంకర్ల పేర్లున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే అంతిమంగా అయిదు మంది పేర్లే ఉంటాయని వారు చెప్పారు. యెస్ బ్యాంక్ వ్యవస్ధాపకుడు, ప్రస్తుత సిఈఓ రాణా కపూర్ స్థానంలో కొత్త సిఈఓను డిసెంబర్ మూడో వారం నాటికే ఎంపిక చేసే అవకాశముందని బ్యాంక్ వరాలు తెలిపాయి. రిజర్వ్ బ్యాంక్ ఇందుకు జనవరి 31 వరకు సమయం ఇచ్చింది. బయటి వారినే కాకుండా యెస్ బ్యాంకులో అంతర్గతంగా సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్లు అయిన రజత్ మోంగా, ప్రళయ్ మండల్ పేర్లను కూడా సెర్‌చ కమిటీ పరిగణనలోకి తీసుకునే అవకాశాలున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. అయితే వీరిని కమిటీ ఇంకా ఇంటర్వూ చేయలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా సెర్చి కమిటీనుంచి ఎస్‌బిఐ మాజీ చీఫ్ ఒపి భట్ రాజీనామా చేయడంపైన కూడా ఆ వర్గాలు వివరణ ఇచ్చాయి.

జాబితాలోని ఓ బ్యాంకర్‌కు చెందిన విదేశీ బ్యాంక్‌కు భట్ గతంలో సలహాదారుగా సేవలందించారని, ఈ కారణంగా సిఈఓ ఎంపికపై తన ప్రభావం ఉండకూడదన్న ఉద్దేశంతోనే భట్ రాజీనామా చేశారని ఆ వర్గాలు తెలిపాయి. కాంపిటేషన్ కమిటీ చైర్మన్ అశోక్ చావ్లా, భట్‌ల రాజీనామా తర్వాత సెర్చి కమిటీలో బయటి వ్యక్తి ఒక్కరు మాత్రమే (బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డిఏఐ చీఫ్ టిఎస్ విజయన్) మాత్రమే మిగిలారని ఆ వర్గాలు తెలిపాయి. మరో వైపు ఈ పరిణామాల నేపథ్యంలో యెస్ బ్యాంక్ షేర్లు నష్ట పోవడం కొనసాగుతూనే ఉంది. గురువారం 7 శాతం నఫ్టపోయిన ఆ షేరు శుక్రవారం మరో 7 శాతానికి పైగా నష్టపోయింది.

Yes Bank is the 5 10 bankers in new CEO race

Telangana Latest News