ఇలాగైతే కుటుంబాలు చీలిపోతాయ్

వాషింగ్టన్ : హెచ్4 వీసాల పరిరక్షణకు అమెరికా కాంగ్రెస్‌లో ఇద్దరు ఎంపీలు బిల్లు ప్రవేశపెట్టారు. భారతదేశంతో పాటు పలు దేశాల నుంచి అమెరికాకు హెచ్1 బి వీసాలపై వెళ్లి ఉద్యోగాలలో ఉన్న జీవిత భాగస్వాముల ఉద్యోగాలకు వర్క్ పర్మిట్‌గా హెచ్4 వీసాలను కల్పిస్తున్నారు. అయితే ట్రంప్ అధికార యంత్రాంగం ఇటీవలి కాలంలో హెచ్ 4 వీసాల రద్దుకు చర్యలు తీసుకోవడం తీవ్రస్థాయి గందరగోళానికి దారితీసింది. ట్రంప్ ప్రభు త్వం హెచ్ 4 వీసాలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా […]

వాషింగ్టన్ : హెచ్4 వీసాల పరిరక్షణకు అమెరికా కాంగ్రెస్‌లో ఇద్దరు ఎంపీలు బిల్లు ప్రవేశపెట్టారు. భారతదేశంతో పాటు పలు దేశాల నుంచి అమెరికాకు హెచ్1 బి వీసాలపై వెళ్లి ఉద్యోగాలలో ఉన్న జీవిత భాగస్వాముల ఉద్యోగాలకు వర్క్ పర్మిట్‌గా హెచ్4 వీసాలను కల్పిస్తున్నారు. అయితే ట్రంప్ అధికార యంత్రాంగం ఇటీవలి కాలంలో హెచ్ 4 వీసాల రద్దుకు చర్యలు తీసుకోవడం తీవ్రస్థాయి గందరగోళానికి దారితీసింది. ట్రంప్ ప్రభు త్వం హెచ్ 4 వీసాలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా చట్టం తీసుకురావాలని చట్టసభ సభ్యులు బిల్లు ప్రవేశపెట్టారు. హెచ్ 4 వెసులుబాటును ఉపసంహరించుకోవడం దేశ ప్రయోజనాలకే విఘాతం అవుతుందని సభ్యులు అన్నారు. జి ఎషో, జోయ్ లాఫ్ గ్రెన్‌లు నిర్థిష్టంగా పేర్కొం టూ ‘హెచ్4 ఎంప్లాయ్‌మెంట్ ప్రొటెక్షన్ బిల్లు’ను కాంగ్రెస్‌లో చర్చకు ప్రతిపాదించారు.

ప్రతిపాదిత చర్యలు, ఇక్కడ పనిచేసే విదేశీయుల జీవిత భాగస్వాములకు వర్క్ పర్మిట్ల రద్దుతో గందరగోళం ఏర్పడుతుంది. ప్రత్యేకించి ప్రతిభావంతులైన వారు తిరిగి వారి దేశాలకు వెళ్లిపోతారు. వారి కుటుంబాలు చీలిపోతాయి. అన్నింటికి మించి ప్రతిభావంతులు విధిలేని పరిస్థితిలో చివరికి అమెరికా వ్యాపార ప్రత్యర్థి సంస్థలలో పనిచేయాల్సి వస్తుందని ఈ బిల్లులో తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో హెచ్ 1 బి నాన్ ఇమిగ్రేషన్ వీసాగా ఉంటూ దీనిపై పలువురు భారతీయులు అమెరికా కంపెనీలలో కీలక ఉద్యోగాలలో ఉన్నారు. ఇక వీరి జీవిత భాగస్వాములు కూడా వివిధ స్థాయిల ఉద్యోగాలు చేసుకోవడానికి హెచ్ 4 వీసాల సౌలభ్యం కల్పించారు. ఒబామా హయాంలో కల్పించిన ఈ సౌకర్యం ఇప్పుడు ట్రంప్ సరికొత్త సంవిధానానికి గురి కానుండటంతో భారతీయ సంతతి ఉద్యోగులలో భవిష్యత్తుపై ఆందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ సభ్యులు తీసుకువచ్చిన హెచ్ 4 ఎంప్లాయ్‌మెంట్ ప్రొటెక్షన్ బిల్లు ఆమోదం పొందితే అది పలువురు భారతీయ ఉద్యోగులకు రక్షణగా నిలుస్తుంది.

హెచ్ 4 వీసాల రద్దుకు ట్రంప్ యంత్రాంగం ఎటువంటి చర్యలూ చేపట్టకుండా అధికారికంగా వీలేర్పడుతుంది. ఈ ఏడాది చివరి నాటికే ట్రంప్ అత్యంత కీలక చట్టాన్ని తీసుకువచ్చి విదేశీ ఉద్యోగులకు చెక్ పెట్టేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ప్రస్తుత ప్రయోజనాన్ని ఎత్తివేయడం వల్ల అమెరికాకు వచ్చిన పలువురు ప్రతిభావంతులు బాధాకరమైన నిర్ణయాలకు దిగాల్సి వస్తుంది. కాబోయే అమెరికా పౌరులకు ఇటువంటి చిక్కులు తెచ్చిపెట్టడం భావ్యం అన్పించుకోదని బిల్లు తీసుకువచ్చిన వారిలో ఒక్కరైన లాఫ్‌గ్రెన్ వ్యాఖ్యానించారు. ట్రంప్ అధికార యంత్రాంగం అనవసరంగా ఆలోచనారహితంగా తీసుకువచ్చే చట్టంతో చివరికి మన ఆర్థిక వ్యవస్థకు గండికొట్టినట్లు అవుతుంది. అసంఖ్యాక ప్రతిభాయుత నైపుణ ఇమిగ్రేంట్ కుటుంబాలను దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇప్పుడు ప్రతిపాదించిన బిల్లు ట్రంప్ అరాచక చట్టాన్ని అడ్డుకుంటుందని ఆశిస్తున్నట్లు సభ్యులు తెలిపారు.

Bill to protect work permits of H4 visa holders

Telangana News

Related Stories: