ఓటమి అంచున శ్రీలంక

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ విజయానికి చేరువైంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ఇంగ్లండ్ మూడు వికెట్ల దూరంలో నిలిచింది. మరోవైపు ఆదివారం చివరి మ్యాచ్‌ను సొంతం చేసుకోవాలంటే ఆతిథ్య శ్రీలంక జట్టు మరో 75 పరుగులు చేయాలి. ఇప్పటికే ఏడు వికెట్లు కోల్పోవడంతో శ్రీలంక ఈ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యమనే చెప్పాలి. అయితే వికెట్ కీపర్ డిక్‌వెల్లా 27(బ్యాటింగ్) క్రీజులో ఉండడంతో లంక ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. […]

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు

పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ విజయానికి చేరువైంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ఇంగ్లండ్ మూడు వికెట్ల దూరంలో నిలిచింది. మరోవైపు ఆదివారం చివరి మ్యాచ్‌ను సొంతం చేసుకోవాలంటే ఆతిథ్య శ్రీలంక జట్టు మరో 75 పరుగులు చేయాలి. ఇప్పటికే ఏడు వికెట్లు కోల్పోవడంతో శ్రీలంక ఈ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యమనే చెప్పాలి. అయితే వికెట్ కీపర్ డిక్‌వెల్లా 27(బ్యాటింగ్) క్రీజులో ఉండడంతో లంక ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. 300 పరుగుల క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంకకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కుశాల్ సిల్వా 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ధనంజయ డిసిల్వా (1) కూడా నిరాశ పరిచాడు. ఆ వెంటనే కుశాల్ మెండిస్ (1) కూడా ఔటయయాడు. దీంతో శ్రీలంక 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను ఓపెనర్ దిముత్ కరుణరత్నె, సీనియర్ ఆటగాడు మాథ్యూస్ తమపై వేసుకున్నారు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టును కష్టాల్లోంచి గట్టెక్కించేందుకు ప్రయత్నించారు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన కరుణరత్నె 4 ఫోర్లతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన రోషన్ సిల్వా కూడా కుదురుగా ఆడాడు. అతని అండతో మాథ్యూస్ మరో మెరుగైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన రోషన్ 37 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక, కీలక ఇన్నింగ్స్ ఆడిన మాథ్యూస్ 137 బంతుల్లో ఆరు ఫోర్లతో 86 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక, వికెట్ కీపర్ డిక్వెల్లా 27 పరుగులతో క్రీజులో ఉన్నాడు. శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. చివరి రోజు ఇంగ్లండ్‌కు విజయం కోసం మూడు వికెట్లు కావాలి. లంక గెలవాలంటే మరో 75 పరుగులు చేయాలి. పరిస్థితులు మాత్రం ఇంగ్లండ్‌కే అనుకూలంగా కనిపిస్తున్నాయి. కాగా, ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు, మోయిన్ అలీ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 346 పరుగులకు ఆలౌటైంది.

England win the second Test against Sri Lanka

Telangana Latest News

Related Stories: