ఆలేరులో కేశవమూర్తి కొత్త విగ్రహం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో ఆలేటివాగు ఒడ్డున వుండే ‘ముడిగెల’లో కళ్యాణీ చాళుక్యల కాలంనాటి కొత్తవిగ్రహం బయటపడ్డది. ఈ విగ్రహం గురించి పత్తి సిద్దులు(స్ధానికరైతు) తెలుపగా కొత్తతెలంగాణ చరిత్రబృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ,  చంటి అక్కడికి వెళ్ళి, విగ్రహాన్ని పరిశీలించి, ప్రతిమాలక్షణాలను బట్టి ఆ శిల్పం కేశవమూర్తిదని గుర్తించారు. ఈ చతుర్భుజాలున్న శిల్పానికి ముందరి రెండు చేతులు విరిగిపోయాయి. వెనక కుడిచేతిలో శంఖం, ఎడమచేతిలో చక్రం వున్నాయి. కుడివైపు పాదాలవద్ద గరుడుడు, […]

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో ఆలేటివాగు ఒడ్డున వుండే ‘ముడిగెల’లో కళ్యాణీ చాళుక్యల కాలంనాటి కొత్తవిగ్రహం బయటపడ్డది. ఈ విగ్రహం గురించి పత్తి సిద్దులు(స్ధానికరైతు) తెలుపగా కొత్తతెలంగాణ చరిత్రబృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ,  చంటి అక్కడికి వెళ్ళి, విగ్రహాన్ని పరిశీలించి, ప్రతిమాలక్షణాలను బట్టి ఆ శిల్పం కేశవమూర్తిదని గుర్తించారు. ఈ చతుర్భుజాలున్న శిల్పానికి ముందరి రెండు చేతులు విరిగిపోయాయి. వెనక కుడిచేతిలో శంఖం, ఎడమచేతిలో చక్రం వున్నాయి. కుడివైపు పాదాలవద్ద గరుడుడు, ఎడమవైపు లక్ష్మీదేవి వున్నారు. కేశవమూర్తి తలకిరువైపుల దశావతారాలు చెక్కివున్నాయి. శీర్షభాగం కొంతభిన్నమై వుంది. ముడిగెలలో గతంలో కూడా చాలా శిల్పాలు బయటపడ్డాయి.

అక్కడ రాష్ట్రకూటులనాటి మహిషాసురమర్దిని, వినాయకుడు, ఆ ప్రాంతంలో బెల్లంబొందగా పిలువబడే చతురస్రాకారపు బావి, ఆంజనేయుని విగ్రహలు దొరికాయి. పూర్వమీ ప్రాంతానికి ‘ముడుగునూరు’ అనే పేరుండేదని ఏపి ఆర్కియాలజీ రివ్యూ(19872001)లో కొలనుపాకలోని జైనదేవాలయం స్తంభంమీది శాసనంలో మహదేవచంద్రభట్టరు సమక్షంలో మహాప్రధాని, దండనాయకుడు మాయిదేవుడు ముడుగునూరు జైనబసదికి భూదానం చేసినట్లు పేర్కొనబడ్డది. ఆ ముడుగునూరే ఇప్పటి ముడిగెల. కొలనుపాకనేలిన పారమార జగద్దేవుడు జైనబసదులలో నొకదానిని వీరనారాయణదేవాలయంగా మార్చి, పునర్నిర్మాణం చేయించిండు. అట్లే ముడుగునూరులో కూడా జైనబసదిస్థానంలో వైష్ణవాలయాలను కట్టించాడని ఇపుడు బయటపడ్డ కేశవమూర్తి శిల్పం వల్ల బోధపడుతున్నది.

New statue of Keshava Murthy is revealed in aluru

Telangana Latest News