తొలి బ్యాలట్ బాక్సర్ గోద్రెజ్

స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు 1952లో నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు  ఇప్పటిలాగా అప్పట్లో ఇవిఎంలు లేవు. ఇవిఎంలతో ఎన్నికల నిర్వహించేంత వరకు పోలింగ్ కేంద్రం అంటే అందరికి బ్యాలెట్ పేపర్, బాక్సే గుర్తుకు వచ్చేవి. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలట్ పేపర్లతో కూడిన ఆ బాక్సులను  స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించే వారు. మరి అంతటి ప్రతిష్టాత్మక బ్యాలట్ బాక్సులను అప్పట్లో ఎవరు తయారు చేశారు? అని మన మదిలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. దానికి సమాధానం […]

స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు 1952లో నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు  ఇప్పటిలాగా అప్పట్లో ఇవిఎంలు లేవు. ఇవిఎంలతో ఎన్నికల నిర్వహించేంత వరకు పోలింగ్ కేంద్రం అంటే అందరికి బ్యాలెట్ పేపర్, బాక్సే గుర్తుకు వచ్చేవి. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలట్ పేపర్లతో కూడిన ఆ బాక్సులను  స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించే వారు. మరి అంతటి ప్రతిష్టాత్మక బ్యాలట్ బాక్సులను అప్పట్లో ఎవరు తయారు చేశారు? అని మన మదిలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. దానికి సమాధానం గోద్రేజ్ కంపెనీ. మనం నిత్యం ఉపయోగించే సబ్బుల నుంచి విమానయాన పరికరాల వరకు తయారు చేసే కంపెనీ గోద్రేజే బ్యాలెట్ బాక్సులనూ తయారు చేసేది. వివిధ కంపెనీల సత్తాను పరిశీలించిన అప్పటి పాలకులు చివరికి బ్యాలెట్ బాక్సుల తయారీకి గోద్రేజే సరియైనదని ఆ కంపెనీపై విశ్వాసాన్ని ఉంచారు. దాంతో 1951 జులై మాసంలో ‘గోద్రేజ్ అండ్ బోయ్సే’ బాక్సుల తయారీకి పూనుకుంది.

విక్రోలిలోని కర్మాగారంలో  వాటి తయారీకి నాంది పలికింది. అహరహం శ్రమించి రోజుకు 15వేల బ్యాలెట్ బాక్సులు తయారు చేసేవారట. 1952లో ఎన్నికలు నిర్వహించే నాటికి 23 రాష్ట్రాలకు కావాల్సిన  12లక్షల బాక్సులను తయారు చేసి, ప్రభుత్వానికి అందజేసి గోద్రేజ్ తన సత్తాను చాటుకుంది. అయితే పోలింగ్ తర్వాత ఓట్ల లెక్కింపు వరకు బ్యాలెట్ బాక్సుల భద్రత అత్యంత కీలకం. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, సామాన్యులు వాటిని సులువుగా తెరవడానికి వీల్లేకుండా కంపెనీ జాగ్రత్తలు తీసుకుంది.  తాళం చెవితో ఇంటి తాళం తీయవచ్చన్నంత సులువుగా కాకుండా దానికి కొంత మేథస్సును జోడించింది. కంపెనీకి చెందిన నాథాలాల్ పంచాల్ అనే నిపుణుడు అద్భుతమైన లాకింగ్ సిస్టమ్‌ను కనిపెట్టాడు. బయటి నుంచి కాకుండా అంతర్గతంగా లాకింగ్ సిస్టమ్ ఉండేలా దాన్ని రూపొందించాడు.  బ్యాలెట్ బాక్సుకు  ప్రత్యేక ద్వారం (రంధం) ఉంటుంది. దాని గుండా ఒక లాకింగ్ లివర్‌తో మాత్రమే బాక్సును తెరవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పోలింగ్ సిబ్బందికి మాత్రమే శిక్షణ ఇచ్చేవారమని, కొన్ని ఖనిజాల మిశ్రమంతో ఒక పదార్థాన్ని తయారు చేసి దాన్ని తయారు చేసేవారమని, అలాగే బ్యాలట్ బాక్సు అలంకరణకు కూడా దాన్నే ఉపయోగించే వారమని గోద్రేజ్  ఉద్యోగి బృందా పథారే చెప్పారు.

Ballot boxer role was first in general elections

Telangana Latest News