టాప్ హీరోయిన్‌తో ఐటమ్‌సాంగ్

అన్ని కమర్షియల్ అంశాలతో పాటు హీరోయిజాన్ని దండిగా పండించడమే బోయపాటి శ్రీను సక్సెస్ థియరీ. స్టార్ హీరో రామ్‌చరణ్‌ తో ‘వినయ విధేయ రామ’ చిత్రాన్ని కూడా ఆయన తనదైన రీతిలో తెరకెక్కిస్తున్నారనేది టీజర్‌తో స్పష్టమైంది. పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అయితే ఈ చిత్రం పూర్తికాకముందే రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న భారీ మల్టీస్టారర్ షూటింగ్ మొదలైంది. దీంతో ‘వినయ విధేయ రామ’ చిత్రం కోసం ముందుగా ప్లాన్ చేసిన […]

అన్ని కమర్షియల్ అంశాలతో పాటు హీరోయిజాన్ని దండిగా పండించడమే బోయపాటి శ్రీను సక్సెస్ థియరీ. స్టార్ హీరో రామ్‌చరణ్‌ తో ‘వినయ విధేయ రామ’ చిత్రాన్ని కూడా ఆయన తనదైన రీతిలో తెరకెక్కిస్తున్నారనేది టీజర్‌తో స్పష్టమైంది. పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అయితే ఈ చిత్రం పూర్తికాకముందే రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న భారీ మల్టీస్టారర్ షూటింగ్ మొదలైంది. దీంతో ‘వినయ విధేయ రామ’ చిత్రం కోసం ముందుగా ప్లాన్ చేసిన ఐటమ్ సాంగ్ తీయరేమోననే అనుమానాలొచ్చాయి. అయితే తన సినిమాలో ఐటమ్‌సాంగ్ ఉండాల్సిందేనని అంటున్నారట బోయపాటి.

ఈ సినిమా విడుదలకు ఇంకా ఎనిమిది వారాల వరకు సమయం ఉంది కాబట్టి నాలుగు రోజుల్లో ఈ సాంగ్ తీయాల్సిందేనని నిర్ణయించుకున్నారట. అయితే రామ్‌చరణ్‌తో కలిసి ఈ ఐటమ్‌సాంగ్‌లో స్టెప్పులేసే అందాల తార ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. టాప్ హీరోయిన్‌తో ఈ పాట చేయించాలని చూస్తున్నారు. ఐటమ్‌సాంగ్ కోసం మంచి ట్యూన్‌ను దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడట. ఈ చిత్రంలో రామ్‌చరణ్ డ్యాన్సులు, మాస్ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఫిల్మ్‌మేకర్స్ అంటున్నారు. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ మాస్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

Item Song In Vinaya Vidheya Rama

Telangana News