రక్తహీనతకు చెక్ పెట్టే చిక్కుళ్లు..!

చలికాలంలో సహజంగానే వ్యాధినిరోధక శక్తి మందగిస్తుంది. దాంతో శరీరం జబ్బుల పాలవుతుంటుంది. అలా కాకుండా ఉండేందుకు ఈ కాలంలో లభించే చిక్కుళ్లను రకరకాలుగా వండుకుని ఆహారంలో భాగం చేసుకోవాలి. చలికాలంలో చలిని, అది తెచ్చి పెట్టే జబ్బులని ఎదిరించి మనలో చురుకుదనాన్ని నింపే శక్తి చిక్కుడు కాయలకు ఉంది. ప్రోటీన్లు పుష్కలంగా దొరికే ఆహారమిది. శాకాహారులు.. గుడ్డు తినలేమే అని బాధపడే వారికి వీటికి మించిన ఆహారం లేదు. వంద గ్రాముల చిక్కుళ్ల నుంచి అందే ప్రొటీన్లు […]

చలికాలంలో సహజంగానే వ్యాధినిరోధక శక్తి మందగిస్తుంది. దాంతో శరీరం జబ్బుల పాలవుతుంటుంది. అలా కాకుండా ఉండేందుకు ఈ కాలంలో లభించే చిక్కుళ్లను రకరకాలుగా వండుకుని ఆహారంలో భాగం చేసుకోవాలి. చలికాలంలో చలిని, అది తెచ్చి పెట్టే జబ్బులని ఎదిరించి మనలో చురుకుదనాన్ని నింపే శక్తి చిక్కుడు కాయలకు ఉంది. ప్రోటీన్లు పుష్కలంగా దొరికే ఆహారమిది. శాకాహారులు.. గుడ్డు తినలేమే అని బాధపడే వారికి వీటికి మించిన ఆహారం లేదు. వంద గ్రాముల చిక్కుళ్ల నుంచి అందే ప్రొటీన్లు గుడ్డున్నర నుంచి వచ్చే ప్రొటీన్లకు సమానమంటే ఆశ్చర్యపోకమానం. వందగ్రాముల చిక్కుళ్ల నుంచి 8 గ్రా. ప్రొటీన్లు అందుతాయి.

ఎవరైనా తినొచ్చు.. కొలెస్ట్రాల్, మధుమేహం, అధిక బరువు ఇలా ఏ అనారోగ్య సమస్య ఉన్నా చిక్కుళ్లు తొనొచ్చు. దీని నుంచి అందే కెలొరీలు, కొవ్వు చాలా తక్కువ. పీచు, ప్రొటీన్ల శాతం సమృద్ధిగా ఉంటుంది. ఒక్క కిడ్నీ సమస్యలున్నవారి విషయంలో మాత్రం కొంత తగ్గించి తీసుకొమ్మని చెబుతారు వైద్యులు. వీటిని పచ్చిగా, ఎండి పోయిన తర్వాత తినడం కన్నా తాజాగా దొరికే ఈ సమయంలోనే తీసుకోవడం వల్ల ఎక్కువ లాభాలున్నాయి. ఫోలిక్‌యాసిడ్, ఇనుము రెండింటి మేళవింపు ఇందులో ఉండటం వల్ల రక్తహీనత రాకుండా ఉంటుంది. మహిళలకు మంచిది. డి విటమిన్ అధికంగా ఉండటం వల్ల వయసుతో పాటూ వచ్చే కీళ్ల సమస్యలు రాకుండా ఉంటాయి. మెగ్నీషియం, పాస్ఫరస్, సెలీనియం వంటి ఫ్లవనాయిడ్లు వ్యాధినిరోధక శక్తి తగ్గకుండా చూస్తాయి.

Plenty of proteins are available in beans

Telagana Latest News