వెయ్యి కిలోల కుక్క మాంసం పట్టివేత..

చెన్నై: వెయ్యి కిలోల కుక్క మాంసాన్ని తరలిస్తుండగా రైల్వే పోలీసులకు పట్టుబడిన సంఘటన చెన్నైలోని  ఎగ్మూర్ రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రాకారం.. రాజస్థాన్ నుంచి చెన్నై వచ్చిన జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ నుంచి ఐదో నెంబర్ ప్లాట్‌ఫాం వద్ద ఓ పార్శిల్‌ను దించారు. అయితే.. రాజస్థాన్ నుంచి కుక్కల మాంసం స్మగ్లింగ్ అవుతోందంటూ రైల్వే పోలీసులకు సమాచారం అందింది. దీంతో రైల్వే స్టేషన్‌ను పోలీసులు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ఆ పార్శిల్ కనిపించింది. […]

చెన్నై: వెయ్యి కిలోల కుక్క మాంసాన్ని తరలిస్తుండగా రైల్వే పోలీసులకు పట్టుబడిన సంఘటన చెన్నైలోని  ఎగ్మూర్ రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రాకారం.. రాజస్థాన్ నుంచి చెన్నై వచ్చిన జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ నుంచి ఐదో నెంబర్ ప్లాట్‌ఫాం వద్ద ఓ పార్శిల్‌ను దించారు. అయితే.. రాజస్థాన్ నుంచి కుక్కల మాంసం స్మగ్లింగ్ అవుతోందంటూ రైల్వే పోలీసులకు సమాచారం అందింది. దీంతో రైల్వే స్టేషన్‌ను పోలీసులు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ఆ పార్శిల్ కనిపించింది. ఆ పార్శిల్‌ను ఓపెన్ చేసి చూసి పోలీసులు అందులో కుక్క మాంసం ఉన్నట్లు గుర్తించారు. పార్శిల్‌లో వెయ్యి కిలోల మాంసం ఉంది. వెంటనే మాంసాన్ని సీజ్ చేసి పరీక్షల కోసం ల్యాబ్‌కు తరలించారు. చెన్నైలోని రెస్టారెంట్లకు తరలించడానికే మాంసాన్ని రాజస్థాన్ నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

1000 Kg of Dog Meat captured in chennai

Telangana News

Related Stories: