మాల్దీవులకు చేరుకున్న ప్రధాని మోడీ

మాలే: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం మాల్దీవులకు బయల్దేరారు. ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహీం మహ్మద్ సోలీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రాజధాని మాలేకి మోడీ చేరుకున్నారు. నగరంలోని నేషనల్ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం మాల్దీవుల అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. గత సెప్టెంబర్ 23న మాల్దీవుల్లో జరిగిన ఎన్నికల్లో సోలీ ఘన విజయం సాధించారు. సోలీ  అధికారికంగా బాధ్యతలు చేపట్టి తర్వాత మోడీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అనంతరం ఈ రోజు రాత్రే మోడీ తిరిగి స్వదేశానికి చేరుకుంటారు. మాల్దీవుల్లో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలనీ, శాంతియుతమైన, […]

మాలే: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం మాల్దీవులకు బయల్దేరారు. ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహీం మహ్మద్ సోలీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రాజధాని మాలేకి మోడీ చేరుకున్నారు. నగరంలోని నేషనల్ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం మాల్దీవుల అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. గత సెప్టెంబర్ 23న మాల్దీవుల్లో జరిగిన ఎన్నికల్లో సోలీ ఘన విజయం సాధించారు. సోలీ  అధికారికంగా బాధ్యతలు చేపట్టి తర్వాత మోడీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అనంతరం ఈ రోజు రాత్రే మోడీ తిరిగి స్వదేశానికి చేరుకుంటారు. మాల్దీవుల్లో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలనీ, శాంతియుతమైన, సుసంపన్న దేశంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శుక్రవారం ప్రధాని మోడీ తన సందేశంలో పేర్కొన్నారు.

Modi attends Maldives new President swearing ceremony

Related Stories: