నైజీరియన్‌ అరెస్ట్..!

హైదరాబాద్: విదేశాల్లో ఉద్యోగాలంటూ ఆన్‌లైన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న నైజీరియాకు చెందిన ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా నిందితుడు వీదేశాల్లో మంచి వేతనాలతో కూడిన ఉద్యోగాలు ఇప్పిస్తానని చెబుతూ నిరుద్యోగుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నాడు. అనంతరం ప్లేట్ ఫిరాయిస్తున్నాడు. ఇలా వరుసగా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, 19 […]

హైదరాబాద్: విదేశాల్లో ఉద్యోగాలంటూ ఆన్‌లైన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న నైజీరియాకు చెందిన ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా నిందితుడు వీదేశాల్లో మంచి వేతనాలతో కూడిన ఉద్యోగాలు ఇప్పిస్తానని చెబుతూ నిరుద్యోగుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నాడు. అనంతరం ప్లేట్ ఫిరాయిస్తున్నాడు. ఇలా వరుసగా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, 19 సెల్‌ఫోన్లు, రెండు పాస్‌పోర్టులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Nigerian arrested by Hyderabad Police in Cheating Case

Telangana Breaking News

Related Stories: