త్రివిక్రమ్ కథకు చిరు గ్రీన్ సిగ్నల్..?

హైదరాబాద్: ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిరు 151వ చిత్రంగా ‘సైరా నరసింహారెడ్డి’ని తనయుడు రాంచరణ్ ఎంతో  ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక మూవీ తర్వాత చిరంజీవి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ సినిమాకు […]

హైదరాబాద్: ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిరు 151వ చిత్రంగా ‘సైరా నరసింహారెడ్డి’ని తనయుడు రాంచరణ్ ఎంతో  ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

ఇక మూవీ తర్వాత చిరంజీవి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ సినిమాకు కమిటైన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం తనదైన స్టైల్లో ఒక మంచి కథను సిద్ధం చేసిన కొరటాల శివ, ఆ కథకు పూర్తి స్క్రిప్ట్ రూపాన్ని ఇచ్చే పనిలో ఉన్నారట. జనవరి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. ఇక తాజాగా మెగాస్టార్ మరో టాప్ డైరెక్టర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతనెవరో కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తన పదునైన మాటలతో మూవీని ఓ రేంజ్ కు తీసుకెళ్లడంతో త్రివిక్రమ్ దిట్టా. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించిన అరవింద సమేత వీరరాఘవ మూవీ విజయం సాధించడంతో ఆయనకు మళ్లీ క్రేజ్ పెరిగింది. అంతకుముందు పవన్ తో చేసిన  ‘అజ్ఞతవాసి’ నిరాశపరిచిన అరవిందతో మళ్లీ విజయాలబాట పట్టాడు.

ఈ నేపథ్యంలో చిరుకు గల క్రేజ్, ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఆయన మూవీ నుంచి ఫ్యాన్స్ ఆశించే అన్ని అంశాలతో త్రివిక్రమ్ ఒక మంచి కథను సిద్ధం చేశాడట. ఇటీవలె చిరంజీవిని కలిసి ఆ కథను వినిపించడం కూడా జరిగిందట. ఆ  స్టోరీలైన్ నచ్చడంతో వెంటనే చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది ఈ వార్తాల సారాంశం. అంతేగాక కొరటాల మూవీ తరువాత మెగాస్టార్ చేయబోయేది త్రివిక్రమ్ తోనే అనే పుకార్లు ఇండస్ట్రీలో షికారు చేస్తున్నాయి. అలాగే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నాడని టాక్. అల్లు అర్జున్ తో సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్, మెగాస్టార్ మూవీపై దృష్టిసారిస్తాడట. దీంట్లో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం ఇంకోన్ని రోజులు వేచి చూడాలి.

Megastar Chiranjeevi Green signal to Trivikram story?

Telangana Breaking News

Related Stories: