న్యూజెర్సీ: అమెరికాలో తెలంగాణకు చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.న్యూజెర్సీలోని వెంట్నార్ సిటీలో నివసిస్తున్న మెదక్‌కు చెందిన సునీల్ ఎడ్లాను ఆయన ఇంటి ఎదుటే ఇద్దరు మైనర్లు తుపాకీతో కాల్చిచంపారు. తన మనవడితో కలిసి ఇంటి బయటకు వస్తున్న సునీల్ పై కాల్పులు జరిపిన దుండుగులు ఆయన కారును దొంగలించారు. ప్రమాదం అనంతరం కుటుంబ సభ్యులు సునీల్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు చెప్పారు.
సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను వెంటాడి దారిలోనే అరెస్ట్ చేశారు. కాగా, సునీల్.. తన తల్లి 95వ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 27న భారత్ కు రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్ననేపథ్యంలో ఇలా జరగడం దారుణమని బంధువులు వాపోతున్నారు. సునీల్ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Telangana person murder in America