అన్ని మతాల వారు సంతోషంగా జీవిస్తున్నారు

హైదరాబాద్: నగరంలో ఎలాంటి భయం లేకుండా అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వారు జీవిస్తున్నారని మంత్రి కెటిఆర్ అన్నారు. శనివారం నాంపల్లిలో ఉన్న రోస్ గార్డెన్స్‌లో మైనార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కెటిఆర్ తోపాటు టిఆర్ఎస్ మంత్రులు మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ… హైదరాబాద్‌లో నాలుగేళ్లలో ఒక్కసారి కూడా కర్ఫ్యూ విధించలేదని, అన్ని మతాల ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారన్నారు. సిఎం కెసిఆర్‌ మాటల్లోనే కాదు చేతల్లో కూడా లౌకికవాది అని […]

హైదరాబాద్: నగరంలో ఎలాంటి భయం లేకుండా అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వారు జీవిస్తున్నారని మంత్రి కెటిఆర్ అన్నారు. శనివారం నాంపల్లిలో ఉన్న రోస్ గార్డెన్స్‌లో మైనార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కెటిఆర్ తోపాటు టిఆర్ఎస్ మంత్రులు మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ… హైదరాబాద్‌లో నాలుగేళ్లలో ఒక్కసారి కూడా కర్ఫ్యూ విధించలేదని, అన్ని మతాల ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారన్నారు. సిఎం కెసిఆర్‌ మాటల్లోనే కాదు చేతల్లో కూడా లౌకికవాది అని నిరూపించుకున్నారన్నారు. మీ అందరి ఆశీస్సులతో కెసిఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి అవుతారన్నారు.

అన్నిమతాల్లోని పేదలకోసం ఎన్నో సంక్షేమ పథకాలను రూపకల్పన చేశామన్నారు. ముస్లింల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశామని, పేద ముస్లిం యువతుల పెళ్లి కోసం షాదీముబారక్ ద్వారా లక్ష రూపాయల సాయం అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్, టిడిపిల పాలనలో ముస్లింలను ఓటు వేసే యంత్రాలుగానే చూశారని విమర్శించారు. అనంతరం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. గత 60 ఏళ్ల పాలనలో దళితులకన్న దౌర్భాగ్య పరిస్థితుల్లో ముస్లింలు జీవించారని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాకే మైనార్టీలు గౌరవంగా బతుకుతున్నారని తెలిపారు.  అహింసా మార్గంలో తెలంగాణను సాధించిన గాంధీ సిఎం కెసిఆర్‌ అని అన్నారు. మైనార్టీల కోసం కెసిఆర్‌ చేసిన కృషి వెలకట్టలేనిదని, కెసిఆర్‌ను ఎందుకు గద్దెదించాలో మహాకూటమి చెప్పాలని నాయిని డిమాండ్‌ చేశారు.

KTR Speech at Minorities meeting in Nampally

Related Stories: