‘ఛాంపియన్’రిషబ్ తో కోహ్లీ

 బ్రిస్బేన్‌: ఆసీస్ పర్యటన కోసం బయల్దేరి వెళ్లిన విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు శనివారం ఆస్ట్రేలియా చేరుకుంది. ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో టీమిండియా 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల సిరీస్‌లు ఆడనుంది. ఆసీస్ చేరిన వెంటనే విరాట్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ఫోటోను పోస్ట్ చేశారు. భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఛాంపియన్‌గా పేర్కొంటూ అతడితో దిగిన పిక్ ను కోహ్లీ అభిమానులతో పంచుకున్నాడు. “బ్యాక్ టు ఆస్ట్రేలియా. మరికొన్ని వారాల పాటు ‘ఛాంపియన్’ రిషబ్ పంత్‌తో […]

 బ్రిస్బేన్‌: ఆసీస్ పర్యటన కోసం బయల్దేరి వెళ్లిన విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు శనివారం ఆస్ట్రేలియా చేరుకుంది. ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో టీమిండియా 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల సిరీస్‌లు ఆడనుంది. ఆసీస్ చేరిన వెంటనే విరాట్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ఫోటోను పోస్ట్ చేశారు. భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఛాంపియన్‌గా పేర్కొంటూ అతడితో దిగిన పిక్ ను కోహ్లీ అభిమానులతో పంచుకున్నాడు. “బ్యాక్ టు ఆస్ట్రేలియా. మరికొన్ని వారాల పాటు ‘ఛాంపియన్’ రిషబ్ పంత్‌తో అని కోహ్లీ తెలిపాడు”. బ్రిస్బేన్‌లో  ఈనెల 21న తొలి టీ20 మ్యాచ్ భారత్ ఈ టూర్ ను ఆరంభించనుంది. ఈ పర్యటనలో కోహ్లీసేన అద్భుతంగా రాణించడం ఖాయమని పలువురు మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆతిథ్య జట్టులో స్టార్ ప్లేయర్స్ అయినా స్మిత్, వార్నర్ లు లేకపోవడం కూడా టీమిండియాకు కలిసి రానుంది. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై విక్టరీ కొట్టడానికి ఇదే మంచి అవకాశం అనడంలో సందేహం లేదు.

Related Stories: