యుఎన్ఒ గుర్తింపుపై పోచారం హర్షం

హైదరాబాద్: రైతుబంధు, రైతుబీమా పథకాలను ఐక్యరాజ్యసమితి గుర్తింపు లభించడం పట్ల వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో ఇలాంటి సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ దక్కుతుందన్నారు. ఇది తెలంగాణకు, రాష్ట్ర రైతాంగానికి దక్కిన గొప్ప వరం అన్నారు. వ్యవసాయరంగం అభివృద్ధి, రైతు సంక్షేమం అనే గొప్ప ఆశయంతో ఈ రెండు పథకాలను అమలు చేస్తున్న సిఎం కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. టిఆర్ఎస్ సర్కార్ అమలు […]

హైదరాబాద్: రైతుబంధు, రైతుబీమా పథకాలను ఐక్యరాజ్యసమితి గుర్తింపు లభించడం పట్ల వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో ఇలాంటి సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ దక్కుతుందన్నారు. ఇది తెలంగాణకు, రాష్ట్ర రైతాంగానికి దక్కిన గొప్ప వరం అన్నారు. వ్యవసాయరంగం అభివృద్ధి, రైతు సంక్షేమం అనే గొప్ప ఆశయంతో ఈ రెండు పథకాలను అమలు చేస్తున్న సిఎం కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

టిఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే కాదు ప్రపంచానికే తలమానికం అన్నారు. రైతన్నలు అప్పుల భారీనుండి బయటపడి తలెత్తుకోని గౌరంగా తిరగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ద్యేయమన్నారు. వ్యవసాయ రంగానికి అవసరమైన 24 గంటలు ఉచిత కరెంట్ ను నాణ్యతతో సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా చూశామన్నామని పోచారం పేర్కొన్నారు. పెట్టుబడికి రైతుబంధు ద్వారా ఆర్ధిక సాయం అందజేస్తున్నామని వెల్లడించారు.

రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించినట్టు తెలిపారు. రైతులు పండించిన పంటకు మద్దతు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులు పండించిన ఉత్పత్తులను నిల్వ చేయడానికి బారీగా గోదాములు నిర్మించామని చెప్పారు. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ. 5 లక్షల బీమాతో కల్పిస్తున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అమలు పర్చుతున్న పథకాలతో ఇప్పటికే తెలంగాణలోని రైతులకు భరోసా కలిగి, తమ వెనుక ప్రభుత్వం ఉందనే బలం వచ్చిందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర రైతులకు ఇంకా మంచి రోజులు రానున్నాయని మంత్రి పోచారం పేర్కొన్నారు.

Pocharam Srinivas Pleased About UNO Recognition

telangana latest news

Related Stories: