‘యాడ్ గురు’అలీక్యూ పడమ్సీ ఇకలేరు

ముంబయి: సీనియర్ న‌టుడు, యాడ్ ఫిలిం మేక‌ర్(యాడ్ గురు), పద్మశ్రీ గ్రహీత అలీక్యూ పడమ్సీ( 90) శనివారం ఉద‌యం క‌న్నుమూశారు. ముంబయిలోని తన నివాసంలో పడమ్సీ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పడమ్సీ ప్ర‌ముఖ ఎడ్వ‌ర్టైజింగ్ ఏజెన్సీ స్థాపించి స‌ర్ఫ్ యాడ్‌, లిరిల్ గ‌ర్ల్‌, చెర్రీ బ్లోసమ్ షూ పోలిష్ కోసం చెర్రీ చార్లీ, హ‌మారా బ‌జాజ్, ఎంఆర్ఎఫ్ మ్యూజిక‌ల్ మ్యాన్ వంటి మ‌ర‌పురాని ప్ర‌క‌ట‌నలు రూపొందించారు. ‘బ్రాండ్ ఫాద‌ర్ ఆఫ్ ఇండియ‌న్ అడ్వర్టైజింగ్’ అనే బిరుదు కూడా ఆయ‌న ద‌క్కించుకున్నారు. […]

ముంబయి: సీనియర్ న‌టుడు, యాడ్ ఫిలిం మేక‌ర్(యాడ్ గురు), పద్మశ్రీ గ్రహీత అలీక్యూ పడమ్సీ( 90) శనివారం ఉద‌యం క‌న్నుమూశారు. ముంబయిలోని తన నివాసంలో పడమ్సీ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పడమ్సీ ప్ర‌ముఖ ఎడ్వ‌ర్టైజింగ్ ఏజెన్సీ స్థాపించి స‌ర్ఫ్ యాడ్‌, లిరిల్ గ‌ర్ల్‌, చెర్రీ బ్లోసమ్ షూ పోలిష్ కోసం చెర్రీ చార్లీ, హ‌మారా బ‌జాజ్, ఎంఆర్ఎఫ్ మ్యూజిక‌ల్ మ్యాన్ వంటి మ‌ర‌పురాని ప్ర‌క‌ట‌నలు రూపొందించారు. ‘బ్రాండ్ ఫాద‌ర్ ఆఫ్ ఇండియ‌న్ అడ్వర్టైజింగ్’ అనే బిరుదు కూడా ఆయ‌న ద‌క్కించుకున్నారు. క్రియేటివ్ ఫీల్డ్‌లో ఆయ‌న అందించిన సేవ‌ల‌కి గాను భారత ప్రభుత్వం 2000 సంవ‌త్స‌రంలో ప‌ద్మ‌శ్రీతో సత్కరించింది. ఇక 1982లో వ‌చ్చిన చారిత్రాత్మ‌క చిత్రం ‘గాంధీ‘లో అలీక్యూ పోషించిన మొహ‌మ్మ‌ద్ అలీ జిన్నా అనే పాత్ర‌తో బాగా పాపులర్ అయ్యారు. ఆయ‌న మృతిపట్ల పలువురు ప్రముఖలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ఆయన మృతికి సంతాపం తెలిపారు. పడమ్సీ కుటుంబ స‌భ్యుల‌కి, స‌న్నిహితుల‌కి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు.

 Ad-filmmaker Alyque Padamsee passes away at 90

Telangana Breaking News

Related Stories: