కాంగ్రెస్ పై మర్రి శశిధర్‌రెడ్డి గుస్సా…

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ శనివారం మూడో జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, పార్టీ అధిష్టానంపై ఆ పార్టీ సీనియర్ నాయకులు మర్రి శశిధర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. మహాకూటమిలో భాగంగా తాను పోటీ చేయదలుచుకున్న సనత్‌నగర్ నియోజకవర్గాన్నికాంగ్రెస్ టిడిపికి కేటాయించడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. సనత్‌నగర్ నుంచి పోటీ చేయడానికి తనకే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పెద్దలకు శశిధర్‌రెడ్డి వేడుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కనీసం మూడో జాబితాలోనైనా సనత్‌నగర్ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయిస్తారనుకుంటే అది  […]

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ శనివారం మూడో జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, పార్టీ అధిష్టానంపై ఆ పార్టీ సీనియర్ నాయకులు మర్రి శశిధర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. మహాకూటమిలో భాగంగా తాను పోటీ చేయదలుచుకున్న సనత్‌నగర్ నియోజకవర్గాన్నికాంగ్రెస్ టిడిపికి కేటాయించడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. సనత్‌నగర్ నుంచి పోటీ చేయడానికి తనకే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పెద్దలకు శశిధర్‌రెడ్డి వేడుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

కనీసం మూడో జాబితాలోనైనా సనత్‌నగర్ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయిస్తారనుకుంటే అది  కాస్త టిడిపికి దక్కింది. కాంగ్రెస్ మూడో జాబితా రిలీజ్ అయిన కొద్దిసేపటికే సనత్‌నగర్ నుంచి కూన వెంకటేష్ గౌడ్ బరిలోకి దిగుతున్నట్టు తెలుగుదేశం పార్టీ వెల్లడించింది. ఎపి సిఎం చంద్రబాబు సూచన మేరకే మర్రి శశిధర్‌రెడ్డికి సీటు లభించలేదరని ఆయన అనుచరులు గరం అవుతున్నారు. బాబు చేతిలో కాంగ్రెస్ కీలుబొమ్మగా మారిందని ఆయన మండిపడ్డారు. మూడో జాబితాలో సైతం తన పేరు రాకపోవడం బాధాకరమని మర్రి శశిధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ రాకపోయిన తనకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని చెప్పిన ఆయన కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు.

Senior Leader Marri Shashidhar Reddy Fire On Congress

telangana latest news

Related Stories: