‘మా సోదరికి మీ ఆశీస్సులు కావాలి’

హైదరాబాద్: ఇటీవల రోడ్డు ప్రమాదంలో అకాలమరణం చెందిన నటుడు, టిడిపి నేత హరికృష్ణ తనయ సుహాసిని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె సోదరులు, నటులు నందమూరి కల్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్ లు సుహాసిని విజయం పట్ల ఆకాంక్షిస్తూ తాజాగా ట్వీట్ చేశారు. నందమూరి బ్రదర్స్ మాటల్లోనే… “ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్దాంతంతో తాతగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగు […]

హైదరాబాద్: ఇటీవల రోడ్డు ప్రమాదంలో అకాలమరణం చెందిన నటుడు, టిడిపి నేత హరికృష్ణ తనయ సుహాసిని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె సోదరులు, నటులు నందమూరి కల్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్ లు సుహాసిని విజయం పట్ల ఆకాంక్షిస్తూ తాజాగా ట్వీట్ చేశారు. నందమూరి బ్రదర్స్ మాటల్లోనే… “ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్దాంతంతో తాతగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగు దేశం పార్టీ మాకు ఎంతో పవిత్రమైనది. మా నాన్నగారు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారు సేవలందించిన తెదేపా తరఫున ఇప్పుడు మా సోదరి సుహాసిని గారు కూకట్ పల్లి నియోజక వర్గం నుండి పోటీ చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. స్త్రీలు సమాజంలో ఉన్నతమైన పాత్ర పోషించాలని నమ్మే కుటుంబం మాది. ఇదే స్ఫూర్తితో ప్రజా సేవకు సిద్ధపడుతోన్న మా సోదరి సుహాసిని గారికి విజయం వరించాలని ఆకాంక్షిస్తున్నామంటూ” వారు ట్వీట్‌ చేశారు.