ఘోర ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం…

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ సమీపంలోని నేషనల్ హైవే 63పై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, లారీ ఒకదానొకటి  ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ఘటన స్థలంలోనే మృతిచెందారు. మరో 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతుల వివరాలు తెలియరాలేదు. […]

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ సమీపంలోని నేషనల్ హైవే 63పై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, లారీ ఒకదానొకటి  ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ఘటన స్థలంలోనే మృతిచెందారు. మరో 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతుల వివరాలు తెలియరాలేదు. కాగా, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Six killed a collision between bus and a lorry near Hubli

Telangana Breaking News

Related Stories: