కమలంతో కలవం

కెసిఆర్‌ను మించిన లౌకికవాది లేరు 16 ఎంపి సీట్లు గెలిచి జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తాం : కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 100 సీట్లు గెలిచి కెసిఆర్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని టిఆర్‌ఎస్ పార్టీ నేత, అపద్దర్మ మంత్రి కె.టి.రామారావు అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 17 ఎంపి స్థానాలకు 16 సీట్లు గెలిచి జాతీయ రాజకీయాలలో టిఆర్‌ఎస్ కీలక పాత్ర పోషించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం సీనియర్ కాంగ్రెస్ […]

కెసిఆర్‌ను మించిన లౌకికవాది లేరు

16 ఎంపి సీట్లు గెలిచి జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తాం : కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 100 సీట్లు గెలిచి కెసిఆర్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని టిఆర్‌ఎస్ పార్టీ నేత, అపద్దర్మ మంత్రి కె.టి.రామారావు అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 17 ఎంపి స్థానాలకు 16 సీట్లు గెలిచి జాతీయ రాజకీయాలలో టిఆర్‌ఎస్ కీలక పాత్ర పోషించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మైనార్టీ కమిషన్ ఛైర్మన్ అబిద్ రసూల్ ఖాన్, ఖలీల్ ఉర్ రెహమాన్‌లు తమ అనుచరులతో మంత్రి కెటిఆర్, డిప్యూటీ సిఎం మహమూద్ అలీల సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. కెటిఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కెసిఆర్‌ను మించిన లౌకికవాది మరొకరు లేరని అన్నారు. ఎక్కడాలేని విధంగా సిద్దిపేటలో ఇక్బర్ మీనార్ కట్టించింది కెసిఆరేనని గుర్తు చేశారు. నాలుగేళ్లలో తమ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం ఎన్నో పథకాలు అమలు చేసిందని చెప్పారు. పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో మైనార్టీల కోసం 200కుపైగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పాఠశాలల్లో సుమారు 50 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకుంటున్న ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.20 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని వివరించారు.

ముస్లింలు తమ పండుగలను ఘనంగా జరుపుకోవడానికి ప్రభుత్వం చేయూతనిచ్చిందని అన్నారు. పేద ముస్లిం ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం షాదీముబాకర్ పథకం కింద రూ. 100116 ఇస్తుందని చెప్పారు. పేదలు ఏ మతంలో ఉన్నా పేదలే అని, పేదల సంక్షేమం కోసమే టిఆర్‌ఎస్ పనిచేస్తుందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీల సంక్షేమం కోసం మరిన్ని అభివృద్ది పథకాలు తీసుకువస్తామని తెలిపారు. బిజెపి, టిఆర్‌ఎస్ పార్టీల మధ్య సిద్దాంత పరమైన విరోధం ఉందని, ఎట్టి పరిస్థితుల్లో తాము మోడీతో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతంలో హైదరాబాద్‌లో గణేష్, హనుమాన్ జయంతి ఉత్సవాల సమయంలో నాలుగైదు రోజులపాటు కర్ఫూ ఉండేదని, నాలుగేళ్ల టిఆర్‌ఎస్ పాలనలో నాలుగు సెకండ్లు కూడా కర్ఫూ లేదని అన్నారు.

డిప్యూటీ సిఎం మహమూద్ అలీ మాట్లాడుతూ, సిఎం కెసిఆర్ ముస్లింలను కంటికి రెప్పలా కాపాడేది కెసిఆరే అని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ బిజెపితో కలుస్తుందని కాంగ్రెస్ పుకార్లు సృష్టిస్తుందని, తాము బిజెపితో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కెసిఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. కెసిఆర్ పోరాటాలతోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని పేర్కొన్నారు.

తాము తెలంగాణ ఇచ్చామన్న కాంగ్రెస్‌ను గత ఎన్నికల్లో ప్రజలు నమ్మలేదని, ఇప్పుడు నమ్మరని అన్నారు. ముస్లింల డిప్యూటీ సిఎం పదవి ఇచ్చిన ఏకైక నాయకుడు కెసిఆర్ అని పేర్కొన్నారు. ముస్లింల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, ఖైరతాబాద్ టిఆర్‌ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ మాట్లాడుతూ, కాంగ్రెస్‌లో ఎవరికీ న్యాయం జరగలేదని అన్నారు. గాంధీ భవన్ నుంచి కార్యకర్తలను బయటకి పంపారని, ఇక కాంగ్రెస్‌కు మిగిలేది బౌన్సర్లే అని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌లో చేరిన అబిద్ రసూల్ ఖాన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో పని చేస్తోందని ఆరోపించారు. ముస్లిం వద్ద ధనబలం లేదని, వారు ఎన్నికల్లో గెలవరని సీట్లు ఇవ్వడం లేదని అన్నారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను స్వాహా చేసిన షబ్బీర్ అలీకి కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తోందని, మూడుసార్లు ఓడిపోయిన షబ్బీర్ అలీకి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

క్రిమినల్ కేసులు ఉన్న వారికే కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిందని ఆరోపించారు. టిఆర్‌ఎస్ పార్టీ ముస్లి్ంలలకు రాజకీయంగా పెద్దపీట వేస్తుందని అన్నారు. ముస్లింలకు డిప్యూటీ సిఎం పదవి ఇచ్చి గౌరవించింది టిఆర్‌ఎస్ పార్టీయే అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను టిడిపి పార్టీ నియంత్రిస్తుందని విమర్శించారు. ఎంఎల్‌సి ఫరూక్ హుస్సేన్ మాట్లాడుతూ, కెసిఆర్‌కు హిందువులు, ముస్లింలు రెండు కళ్ల లాంటి వారని అన్నారు. 2019లోనే కాదు, మరో 20 ఏళ్లు కెసిఆర్ సిఎంగా ఉండాలని ఆకాంక్షించారు.

Win 16 MP seats and play a key role in national politics

Telangana Latest News

Related Stories: