కోదండఢాం

తేలని జనగామ, మిర్యాలగూడ పంచాయతీ కెసిఆర్‌ను ఎదుర్కోవడం అంత సులువుకాదు ప్రత్యేక వ్యూహం ఉంటే తప్ప గెలుపు సాధ్యంకాదు: కోదండరాం జన సమితిలో టిక్కెట్ల లొల్లి అభ్యర్థుల ప్రకటన వాయిదా టిజెఎస్ కార్యాలయంలో కోదండరాంతో ఉత్తమ్ భేటీ స్థానాల కేటాయింపుపై చర్చ మన తెలంగాణ/హైదరాబాద్ : టిజెఎస్ అధినేత కోదండరాంకు ఊహించని షాక్ తగిలింది. మిర్యాలగూడ నియోజకవర్గంలో విజేందర్‌రెడ్డి పేరు తెరపైకి రావడంతో ఆ స్థానాన్ని ఆశించిన అదే పార్టీకి చెందిన విద్యాధర్‌రెడ్డి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. […]

తేలని జనగామ, మిర్యాలగూడ పంచాయతీ

కెసిఆర్‌ను ఎదుర్కోవడం అంత సులువుకాదు
ప్రత్యేక వ్యూహం ఉంటే తప్ప గెలుపు సాధ్యంకాదు: కోదండరాం
జన సమితిలో టిక్కెట్ల లొల్లి
అభ్యర్థుల ప్రకటన వాయిదా
టిజెఎస్ కార్యాలయంలో కోదండరాంతో ఉత్తమ్ భేటీ
స్థానాల కేటాయింపుపై చర్చ

మన తెలంగాణ/హైదరాబాద్ : టిజెఎస్ అధినేత కోదండరాంకు ఊహించని షాక్ తగిలింది. మిర్యాలగూడ నియోజకవర్గంలో విజేందర్‌రెడ్డి పేరు తెరపైకి రావడంతో ఆ స్థానాన్ని ఆశించిన అదే పార్టీకి చెందిన విద్యాధర్‌రెడ్డి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. జనగాం స్థానంపై కోదండరాంతో ఆయ న టిజెఎస్ ఆఫీస్‌లో ఉత్తమ్ శుక్రవారం అర్థరాత్రి చర్చించారు. టిజెఎస్‌కు ఇచ్చే స్థానాలపై వివరణ ఇచ్చారు. మిర్యాల గూడ స్థానంపై కూడ చర్చ జరిగింది. జానారెడ్డి మద్దతు ఉంటే తప్ప మిర్యాలగూడలో గెలవడం సాధ్యం కాదని టిజెఎస్ భావించడంతో ఆయన సూచించిన అభ్యర్థి పేరును పరిశీలించాల్సి వచ్చింది. జానారెడ్డి తన వియ్యంకుడి సోదరుడైన విజేందర్‌రెడ్డి పేరు ను టిజెఎస్‌కు సూచించినట్లు తెలిసింది. ఈ సమాచారం తెలుసుకున్న విద్యాధర్‌రెడ్డి వర్గీయులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు.

మిర్యాలగూడ స్థానం నుంచి విద్యాధర్‌రెడ్డి పోటీ చేయాలనుకుంటున్నారు. కోదండరాం సైతం అతనికే టికెట్ ఇవ్వాలనుకుంటున్నారు. అయితే జానారెడ్డి తన కుమారుడికి ఈ స్థానాన్ని కోరుకున్నా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆయన మద్దతు లేకుండా టిజెఎస్ గెలవడం కష్టమని అభిప్రాయపడిన కాంగ్రెస్ ఢిల్లీ వర్గాలు కోదండరాంకు ఈ మేరకు సూచన చేశాయి. ఈ పరిస్థితుల్లో విద్యాధర్‌రెడ్డి వర్గీయులు జానారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ వ్యవహారంలో జోక్యం చేసుకోడానికి జానారెడ్డి ఎవరని ప్రశ్నించారు. విద్యాధర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించాలని కోదండరాం భావించారని, అయితే ఈ స్థానాన్ని ఆశించిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ఆశాభంగం ఎదురుకావడంతో ఈ స్థానంలో విజేందర్‌రెడ్డిని ఎంపిక చేయాలంటూ వత్తిడి వచ్చిందని వారు వ్యాఖ్యానించారు. మిర్యాలగూడ స్థానంలో టిజెఎస్ తరఫున ఏ అభ్యర్థిని నిలబెట్టాలనేది పార్టీ నిర్ణయమే తప్ప మరో పార్టీకి చెందినవారు ఎలా నిర్దేశిస్తారని ప్రశ్నించారు. జానారెడ్డి వియ్యంకుడి సోదరుడైన మేరెడ్డి విజేందర్‌రెడ్డిని నిలబెట్టాలంటూ వచ్చిన సూచనపై టిజెఎస్‌లో ఇప్పుడు నిప్పు రాజుకుంది.

విజేందర్‌రెడ్డికి టికెట్ ఇచ్చినట్లయితే టిజెఎస్ బండారాన్ని బయటపెడతామని విద్యాధర్‌రెడ్డి అనుచరులు హెచ్చరించారు. సీట్ల సర్దుబాటులో భాగంగా కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చలు జరుగుతున్న సమయంలోనే మిర్యాలగూడ స్థానాన్ని టిజెఎస్‌కు ఇవ్వాలని నొక్కిచెప్పడంతో పాటు విద్యాధర్‌రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసిన విషయం కూడా చర్చకు వచ్చిందని అనుచరులు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇంత లోతుగా చర్చలు జరిగి నిర్ణయం తీసుకున్న తర్వాత హఠాత్తుగా విజేందర్‌రెడ్డి పేరు ఎలా తెరపైకి వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. పార్టీ లోపలే అసంతృప్తి వ్యక్తం కావడంతో ఆరుగురి పేర్లతో జాబితాను విడుదల చేయాల్సిన ప్రక్రియను కోదండరాం శనివారానికి వాయిదా వేశారు.

జనగాంపై కొనసాగుతున్న ప్రతిష్టంభన
జనగాం అసెంబ్లీ స్థానంపై కూటమిలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ వెళ్ళి వచ్చిన కోదండరాం ఈ స్థానంపై కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చ జరగలేదని శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా వ్యాఖ్యానించారు. జనగాం స్థానంలో టిజెఎస్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కూటమి సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ జాప్యం చేయడంతో ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని, అధికార టిఆర్‌ఎస్‌ను ఓడించాలంటే స్పష్టమైన వ్యూహాన్ని అవలంబించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సకాలంలో సరైన నిర్ణయం తీసుకోని కారణంగా తమ పార్టీ చాలా నష్టపోయిందన్నా రు. తమకు కాంగ్రెస్ ఎనిమిది సీట్లు కేటాయించినట్లు వార్తలు వస్తున్నా తాము మాత్రం పన్నెండు స్థానాల్లో పో టీ చేస్తామని, నాలుగుచోట్ల స్నేహపూర్వక పోటీ ఉంటుందని పేర్కొన్నారు. జనగాం స్థానం విషయంలో తమకు కాంగ్రెస్ నుంచి ఎలాంటి సమాచారమూ రాలేదన్నారు.

నేడు కాంగ్రెస్ తుది జాబితా ప్రకటన
కాంగ్రెస్ రెండు జాబితాల్లో 75 మంది అభ్యర్థులను ప్రకటించినా మిగిలిన 19 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఏఐసిసి కసరత్తు ముగిసినట్లు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛారి ఆర్‌సి కుంటియా, ఏఐసిసి కార్యదర్శి బోసు రాజు మీడియాకు వివరించారు. శనివారం ఉదయం జాబితా విడుదల ఉంటుందని పేర్కొన్నారు. అయితే జనగాం విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కోదండరాంతో రాహుల్‌గాంధీ చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని పేర్కొన్నారు. పొన్నాల లక్ష్మయ్యను కూడా రాహుల్‌గాంధీ సముదాయించారని, అంతా సద్దుమణిగినట్లేనని వివరించారు. అయితే కోదండరాం హైదరాబాద్ వెళ్ళగానే ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో, పొన్నాల లక్ష్మయ్యతో మాట్లాడుతారని పేర్కొన్నారు. ఆ తర్వాత పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ ఇవ్వడంపై స్పష్టత వస్తుందని సూచనప్రాయంగా తెలిపారు. కానీ శుక్రవారం అర్థరాత్రి వరకూ కుంటియా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్‌కు చేరుకోకపోవడంతో నగరంలో కాంగ్రెస్, టిజెఎస్‌ల మధ్య హైడ్రామా చోటుచేసుకుంది.

Telangana Congress MLA Candidates Final List

Telangana Latest News

Related Stories: