కేసీఆరే కావాలి

తెలంగాణ వచ్చాక ఈ నాలుగున్నరేళ్లలోని అతి తక్కువ సమయంలో తాను చేసిన పనులు చెప్పుకుంటూ “చేసింది చేరానా చేయాల్సింది బారానా పనులు మిగిలున్నాయి” అని కేసీఆర్ తన ఆచరణాత్మక కొలమానం ప్రకారం స్పష్టంగా గజ్వేల్ కార్యకర్తల సభలో చెప్పారు. కానీ, 60 ఏళ్ల మహాకూటమి నేతలు చేసిన పనులు చూస్తే వాళ్ల అకౌంట్‌జీరో. కేసీఆర్ లెక్క ప్రకారం తాను చేసిన పనులు చేరానా అంటే వాళ్ల లెక్కప్రకారం 200 శాతం పనులు చేసినట్లు లెక్కవుతుంది. 2018లో రెండవసారి […]

తెలంగాణ వచ్చాక ఈ నాలుగున్నరేళ్లలోని అతి తక్కువ సమయంలో తాను చేసిన పనులు చెప్పుకుంటూ “చేసింది చేరానా చేయాల్సింది బారానా పనులు మిగిలున్నాయి” అని కేసీఆర్ తన ఆచరణాత్మక కొలమానం ప్రకారం స్పష్టంగా గజ్వేల్ కార్యకర్తల సభలో చెప్పారు. కానీ, 60 ఏళ్ల మహాకూటమి నేతలు చేసిన పనులు చూస్తే వాళ్ల అకౌంట్‌జీరో. కేసీఆర్ లెక్క ప్రకారం తాను చేసిన పనులు చేరానా అంటే వాళ్ల లెక్కప్రకారం 200 శాతం పనులు చేసినట్లు లెక్కవుతుంది.

2018లో రెండవసారి జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పక్షాలు మ్యానిఫెస్టోలను ప్రకటించుకొని, తమను గెలిపిస్తే ఇది చేస్తాం, అది చేస్తాం అని వాగ్దానాలు గుప్పిస్తున్న సందర్భమిది. ఈ దెబ్బతో మూలనపడ్డ పనులన్నీ వాగ్దానాల రూపంలో ప్రాణం పోసుకుని వస్తున్నాయి. ఈసారి జరిగే ఎన్నికలు అన్నీ ఎన్నికలులాగా రొటీన్‌గా జరిగేవి కావు. మొత్తం తెలంగాణ సమాజం భవిష్యత్తుకు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఆచితూచి ఓటరు ఆలోచించుకుని మరీ ఓటు వేస్తారు. తెలంగాణ రాకముందు చూపుడు వేలుకు చుక్కపెట్టించుకుని వేసిన ఓటుకు తెలంగాణ వచ్చినాక వేస్తున్న ఓట్లకు కూడా చాలా తేడా ఉంది. ఈ ఎన్నికలను, మొత్తం తెలంగాణ సమాజాన్ని ప్రతివిషయంలో తెలంగాణ అవతరణకు ముందు, ఆ తర్వాత అన్న సోయితోనే చూడాలి. అలాగే చూస్తున్నాం.

2014 జూన్ 2 తర్వాత అవతరించిన తెలంగాణలో కేసీఆర్‌కు, ఆయన నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌కు పరిణితితోనే ఓట్లు వేసి గెలిపించారు. తెలంగాణ సమాజం ఎంత చైతన్యంతో బాధ్యతను కేసీఆర్‌పై పెట్టందో, అంతే బాధ్యతతో ఆయన తెలంగాణ సమాజాన్ని తీర్చిదిద్దేందుకు కంకణదారుడు అయ్యారు. కేసీఆర్ పాలనతో మొదలైన తెలంగాణ అనే వాక్యంతోనే రాష్ట్ర అవతరణ తర్వాత చరిత్ర మొదలవుతుంది. కేసీఆర్ పాలన కొనసాగించింది నాలుగు సంవత్సరాల మూడు నెలల పాలన. నాలుగున్నరేళ్ల పాలన కొనసాగింపులైన ప్రజలు ఇవ్వబోయే తీర్పుకు సంకేతంగా ఈ ఎన్నికల ఫలితాలుండబోతున్నాయి.

ఈ ప్రజా తీర్పు విస్తృత వేదికపైకి వచ్చి కేసీఆర్ కంఠం విప్పి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. కేసీఆర్ నాలుగున్నరేళ్లుగా కేసీఆర్ దార్శనికతతో ఏయే రంగాన్ని ఏ విధంగా తీర్చిదిద్ది పనిచేశారో వివరిస్తారు. తనకిచ్చిన నాలుగున్నరేళ్ల పాలనలో గతానికి పట్టిన బూజును ఎలా దులిపారో, పాకుడుబట్టిన ఆధిపత్య రాజకీయాలను చెక్కుకుంటూ నవనిర్మాణాలు చేసుకుంటూ ఎలా ముందుకు సాగారో కేసీఆర్ కంఠం విప్పి ప్రకటిస్తున్నారు. గత 64 ఏళ్లలో తెలంగాణను ఈ మహాకూటమిలోని మహానేతలు ఎంతెంత ధ్వంసం చేశారో కేసీఆర్ చిట్టావిప్పి చెబుతున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో ప్రతి ప్రాజెక్టుకు ఎలా అడ్డుపడ్డారో విప్పి చెపుతారు. ఒక రకంగా ఈ నాలుగున్నరేళ్ల తక్కువ కాలంలో 64 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఎలా చేశారో చెప్పి కేసీఆర్ ఓటు అడుగుతున్నారు. ఈ తెలంగాణకు ఎవరెవరు ఏమేమి చేశారో చెప్పమనండి అని ధైర్యంగా ప్రతిపక్షాలను గద్ధిస్తున్నారు.

విధ్వంసం చేసినవారికి, తెలంగాణ పునర్నిర్మాణం చేస్తున్న వారికి ఎంత తేడా ఉంది. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమాన్ని అణచేసిన వాళ్లు, ఉద్యమంపై విషం కక్కిన కుట్రదారులకు, పాలనను కూడా ఉద్యమంగా మార్చి దూసుకుపోతున్న కేసీఆర్‌కు మధ్య జరుగుతున్న ఈ ఎన్నిక ఓటర్ల చైతన్యానికి మరింత పదునుపెడుతుంది. ఓ ప్రభుత్వ పాలనకు సంబంధించిన ఇంత చర్చ ఇంతకు ముందెన్నడూ ఇంతగా జరుగలేదు. అభివృద్ధికి, అభివృద్ధి నిరోధకత్వానికి, చేతనకు అచేతనకు, పునర్నిర్మాణానికి, విధ్వంసానికి మధ్యన ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. హామీలు నిలబెట్టవు. ఆచరణే భవిష్యత్తునిస్తుందని కేసీఆర్ ఆత్మవిశ్వాసంతో ఒక్కనిగా దూసుకొస్తున్నారు.“గంగగోవు పాలు గరిటడైనను చాలు” అన్నట్లుగా కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాలనను 64 ఏళ్లపాలనతో తూచి చూడవలసి ఉంది. ఒక లక్ష్యాన్ని గెలవటానికి కావాల్సిన మొండితనం, తెగువ, ధైర్యం, ఆత్మవిశ్వాసం గుండెల నిండా దట్టించుకుని తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్ పూనుకున్నారు.

మహాకూటమి కాదది
పాతకాపుల కూటమి
తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. 60 ఏళ్లుగా ఉన్న పాత కాపులే కదా తిరిగి ఇపుడు మహాకూటమి పేరుతో వచ్చి ఓట్లడుగుతున్నారు? అధికారానికి దూరమైన పాతకాపుల వెంపర్లాట స్పష్టంగా కనిపిస్తుంది. మహాకూటమిలో కొత్త రక్తం లేదు. కొత్త తరం లేదు. కొత్తదనం అసలు లేనేలేదు. అవన్నీ 60ఏళ్లు వాగ్దానాలు చేసి ఏమీ చేయకుండా తెలంగాణకు శూన్యహస్తాలు చూపిన చేతులవి. ఈ ఎన్నికల్లో విశేషమేమిటంటే అసలు ఏమీ చేయని వాడు కొద్దో గొప్పో చేసిన వారిని విమర్శించటం. 60 ఏళ్లుగావాళ్లు చేయలేని పనులన్నీ చేసి చూపిస్తూ కదలిక తెచ్చిన వ్యక్తి కేసీఆర్.

తెలంగాణ వచ్చాక ఈ నాలుగున్నరేళ్లలోని అతి తక్కువ సమయంలో తాను చేసిన పనులు చెప్పుకుంటూ “చేసింది చేరానా చేయాల్సింది బారానా పనులు మిగిలున్నాయి” అని కేసీఆర్ తన ఆచరణాత్మక కొలమానం ప్రకారం స్పష్టంగా గజ్వేల్ కార్యకర్తల సభలో చెప్పారు. కానీ, 60 ఏళ్ల మహాకూటమి నేతలు చేసిన పనులు చూస్తే వాళ్ల అకౌంట్ జీరో. కేసీఆర్ లెక్క ప్రకారం తాను చేసిన పనులు చేరానా అంటే వాళ్ల లెక్కప్రకారం 200 శాతం పనులు చేసినట్లు లెక్కవుతుంది.

సామాజిక బాధ్యతగా కేసీఆర్ అడుగులు
ఏ ప్రభుత్వానికైనా సామాజిక బాధ్యత ఉండాలి. సామాజిక బాధ్యతలేని ప్రభుత్వం నిరర్ధకమైనది. సామాజిక బాధ్యతను కేసీఆర్ గుర్తెరిగి పని చేస్తున్నారు. అది మా బాధ్యతేనని అంటున్న ప్రభుత్వమిది అభివృద్ధిని 60 ఏళ్లుగా గాలికి వదిలేసింది ఎవరో తెలంగాణ ప్రజలు గుర్తించగలరు. కేసీఆర్ సంక్షేమరంగానికి పెద్దపీట వేసి తెలంగాణలో సామాజిక వర్గాలు తమకాళ్లపై తాము నిలబడే విధంగా సంక్షేమ పథకాలు రూపొందించారు. కానీ, గత పాలకులు పేదలను ప్రభుత్వ పథకాలుగానే చూశారు. తెలంగాణ వచ్చాక పేదల సంక్షేమం అంటే వాళ్లకు వాళ్లు స్వతంత్రంగా నిలబడి అన్ని రంగాల్లో ఎదగటానికి కేసీఆర్ పునాదుల వేస్తున్నారు. ఈ విషయాలను తెలంగాణ బహుజన సమాజం గుర్తుంచుకుంటుంది. తెలంగాణ బహుజన సమాజం చేసిన పనులను గుర్తుపెట్టుకునే కృతజ్ఞతగల సమాజం. తమ కోసం నిలిచిన వారిని తాము ఎలా కాపాడుకోవాలో బాగా తెలిసిన సమాజం తెలంగాణ బహుజన సమాజం.

తెలంగాణ సమాజాన్ని చక్కబెట్టి తీర్చిదిద్దగల శక్తి సామర్థ్యాలు కేసీఆర్‌లో పుష్కలంగా ఉన్నాయన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ఎన్నికల వేళ ఎవరు ఎవరి మీద ఎన్నెన్ని మాట్లాడినా చివరకు బ్యాలెట్ బాక్స్ దగ్గరకు వస్తే కేసీఆర్‌పై వున్న విశ్వాసమే టీఆర్‌ఎస్‌కు రక్షగా మారి విజాయాన్ని వరింప జేస్తుంది. తాను చేసిన పనిని ప్రజలకు చూపించి ధైర్యంగా ఓటడుగుతుంది కేసీఆర్ ఒక్కటే అనుకుంటా!! 2014 మ్యానిఫెస్టోలో ప్రకటించిన విషయాలన్నింటిని పూర్తి చేయటమేగాకుండా, అందులో చెప్పని 74 పథకాలను ప్రజలకు చేరువచేశామని కేసీఆర్ ఢంకా బజాయించి మరీచెబుతున్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం పేదరికంలేని రాష్ట్రంగా నిలవాలన్నదే తన లక్ష్యమని ప్రకటించి ఆయన పునర్నిర్మాణాన్ని తన భుజంపైకి ఎత్తుకున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులను అన్ని వసతులతో తీర్చిదిద్ది ధనవంతులకు, పేదవాళ్లకు తేడా లేకుండా అందరికీ సమానంగా వైద్యం అందించాలన్నది కేసీఆర్ సంకల్పం. అందుకోసం ఆచరణాత్మకంగా సాధ్యమయ్యే పనుల కోసం సుదీర్ఘంగా చర్చించారు. ఆ దిశగా తన ప్రభుత్వ పని తీరును తీర్చిదద్దుకుంటున్నారు. ప్రతివ్యక్తి మెడికల్ ఇన్సూరెన్స్ పొందే విధంగా, పేదల మీద భారం లేకుండా ప్రతివ్యక్తికి ఉచితంగా అందించాలన్నది కేసీఆర్ స్వప్నం. ఆ లక్ష్యం వున్న మనిషి కాబట్టే ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, బడ్జెట్‌కు సంబంధించి సుదీర్ఘమైన చర్చ జరుగుతున్న సందర్భంలో ఆకస్మికంగా ఆరోగ్య అంశాలు చర్చకు వచ్చాయి. తెలంగాణలో ప్రతి ఒక్కరికి కంటిచూపుకు సంబంధించిన పరీక్షలు జరపాలి. అందుకు ఒక యాక్షన్‌ప్లాన్ తయారుచేస్తే ఎలా ఉంటుందని కేసీఆర్ అనటంతో ఆ సమావేశంలో కూర్చున్న ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లు, ఉన్నతాధికారులు, మంత్రులు ఒక్కసారిగా ఆశ్చర్యచకితులయ్యారు.

ఇది ఎట్లా సాధ్యమైతుందని కేసీఆర్ చర్చించారు.
నిజంగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆచరణ ఏమిటని చూస్తే ఈ వ్యాసం రాసేనాటికి 80 లక్షల మందికి కంటిచూపు పరీక్షలు చేసి అవసరమైన వాళ్లందరికీ కళ్లజోళ్లు ఇచ్చారు. ఆచరణాత్మకంగా కేసీఆర్ చేపట్టిన పనులను ప్రజలు మర్చిపోరు. కంటిచూపు పరీక్షలు, దృష్టిలో లోపం లేకుండా చూస్తున్న చూపు కేసీఆర్ దీక్షను దీవిస్తాయి. పేదరికాన్ని పారద్రోలాలి. సమర్థవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దుకునేందుకు విద్యారంగాన్ని ప్రాథమిక దశ నుంచి పటిష్టంగా తయారుచేసుకోవాలి. తెలంగాణ నుంచి శక్తివంతమైన మానవ వనరులను దేశానికి, ప్రపంచానికి అందించాలన్న లక్ష్యంతోనే గురుకులు విద్యాలయాలు నెలకొల్పారు. అవి ఈ నాలుగేళ్లలో సత్ఫలితాలను ఇస్తున్నాయి.

దీని తర్వాత ఇంటర్, డిగ్రీ, పిజీ అన్ని ప్రొఫెషనల్ కోర్సులను తీర్చిదిద్దేపని మొదలు పెట్టారు. విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గత పాలకులు చేసిన నిర్వాకం వల్ల నాణ్యతలేని చదువు రాజ్యమేలింది. ప్రభుత్వ విద్యారంగం పటిష్టమవుతుంది. ఇంటర్, పదవతరగతి ఫలితాల్లో ప్రభుత్వ సంస్థలనుంచే వచ్చిన విద్యార్థులే అత్యధిక మార్కులు, ర్యాంకులు సాధిస్తున్నారు. ఇది తెలంగాణ విజయం కాదా? ఇది పేద వర్గాల పిల్లలకు వరం కాదా? కేసీఆర్ దార్శనికుడు. ఒక్కొక్క రంగాన్ని ప్రక్షాళన చేసుకుంటూ మంచి భవిష్యత్తును అందించేందుకు స్టేట్స్‌మెన్స్‌గా ఆయన ఆలోచించి అడుగులు వేస్తున్నారు. తెలంగాణకు కేసీఆరే కావాలి. ఎన్నికల్లో కేసీఆరే గెలవాలి. కేసీఆర్ గెలుపే తెలంగాణ మలుపు

This election is not routine of elections

Telangana Latest News