నరకంగా మారిన స్వర్గం

ప్యారడైజ్ : అమెరికాలోని ప్యారడైజ్ భయానక కార్చిచ్చుతో నరకం అయింది. కాలిఫోర్నియా ప్రాంతంలో భీకర స్థాయిలో అంటుకున్న మంటల్లో ఇప్పటివరకూ 600 మందికి పైగా గల్లంతు అయినట్లు వెల్లడైంది. దీనితో అమెరికాలో ఇదో అత్యంత విషాదకర ఘటనగా మారింది. ఇప్పటివరకూ కార్చిచ్చులో సజీవ దహనం అయిన 63 మందిని వివిధ ప్రాంతాలలో గుర్తించారు. శీఘ్రగతిని వ్యాపిస్తూ ఎంతకూ అదుపులోకి రాకుండా ఉన్న మంటలకు ఏడుగురు బలి అయినట్లు గురు, శుక్రవారాలలో గుర్తించారు. దీనితో ఇప్పటివరకూ గుర్తించిన మృతుల […]

ప్యారడైజ్ : అమెరికాలోని ప్యారడైజ్ భయానక కార్చిచ్చుతో నరకం అయింది. కాలిఫోర్నియా ప్రాంతంలో భీకర స్థాయిలో అంటుకున్న మంటల్లో ఇప్పటివరకూ 600 మందికి పైగా గల్లంతు అయినట్లు వెల్లడైంది. దీనితో అమెరికాలో ఇదో అత్యంత విషాదకర ఘటనగా మారింది. ఇప్పటివరకూ కార్చిచ్చులో సజీవ దహనం అయిన 63 మందిని వివిధ ప్రాంతాలలో గుర్తించారు. శీఘ్రగతిని వ్యాపిస్తూ ఎంతకూ అదుపులోకి రాకుండా ఉన్న మంటలకు ఏడుగురు బలి అయినట్లు గురు, శుక్రవారాలలో గుర్తించారు. దీనితో ఇప్పటివరకూ గుర్తించిన మృతుల సంఖ్య 63కు చేరుకుంది. గత వందేళ్లలో కాలిఫోర్నియా ప్రాంతంలో ఇంతటి తీవ్రస్థాయిలో దావాలనం చెలరేగలేదు. ప్యారడైజ్ పట్టణం దాదాపుగా భస్మీపటలం అయిపోయింది. వందలాది ఇళ్లు కాలి బూడిద దిబ్బలుగా మారాయి. పలు వాహనాలు ఆనవాళ్లు లేకుండా తగులబడ్డాయి.

గల్లంతయిన 600 మంది పరిస్థితి ఏమిటనేది ఇప్పటికీ తెలియకపోవడంతో అధికార యంత్రాంగం ఆందోళన చెందుతుంది. వీరిలో ఎందరు సజీవంగా ఉన్నారు? ఎందరు మంటలలో కాలిపొయ్యారనేది తేలాల్సి ఉంది. ఈ నెల 8వ తేదీన కార్చిచ్చు తలెత్తింది. పలు ప్రాంతాల నుంచి అత్యయిక ఫోన్ కాల్స్ రావడంతో గురువారం వరకూ గల్లంతయిన వారి సంఖ్య 300 వరకూ ఉండగా ఇది శుక్రవారం నాటికి రెండింతలు దాటింది. కార్చిచ్చు కారణాలు, అదుపు చర్యలపై ఆరాతీసేందుకు విచారణాధికారులను నియమించారు. వీరికి పలు స్థాయిల నుంచి అత్యవసర సందేశాలు అందుతున్నాయి. అయితే అదుపులోకి రాకుండా ఉన్న కార్చిచ్చుతో మంటలలో చిక్కుపడ్డ వారిని గుర్తించడం కష్టంగా మారింది. ప్రస్తుత మంటలలో 9వేల వరకూ భవనాలు దగ్ధం అయ్యాయి. పలు వేలాది ఇళ్లకు మంటల ముప్పు నెలకొని ఉంది.

ఇప్పటికే ముప్పు ఉన్న ప్రాంతాల నుంచి లక్షలాది మందిని దూర ప్రాంతాలకు తరలించారు. సాధారణంగా అమెరికాలో కొన్ని ప్రాంతాలలో నిర్ణీత సమయంలో అడవులు తగులబడటం సాధారణం. అయితే వందేళ్లలో ఇప్పటి స్థాయిలో కార్చిచ్చు రాలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రాంతంలోని హాలీవుడ్ ఇతర పర్యాటక ప్రాంతాలు కార్చిచ్చు భయాలతో నిర్మానుష్యం అయ్యాయి క్యాంప్‌ఫైర్‌గా విస్తరిస్తున్న మంటలు వ్యాపించిన ప్రాంతాలలో గల్లంతయిన వారి జాబితాలను అధికార యంత్రాంగం రూపొందిస్తోంది. ప్రస్తుత పరిస్థితి అసాధారణంగా , అత్యవసరంగా ఉందని బట్టి కౌంటీ షెరీఫ్ కోరీ హోనియా జర్నలిస్టులకు తెలిపారు. పలు ప్రాంతాల్లో వ్యక్తుల జాడ తెలియడం లేదని వెల్లడించారు. మలిబూలోని పలు ప్రాంతాలను మంటలు కమ్ముకుంటున్నాయి. దీనితో ఇక మరో ముగ్గురు దహనం అయినట్లు , పలువురు హాలీవుడ్ ప్రముఖుల నివాసాలు తగులబడి పోయినట్లు అధికారులు తెలిపారు. శనివారం ప్రెసిడెంట్ ఈ కార్చిచ్చు ప్రాంతాలలో పర్యటించనున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు.

ప్యారడైజ్ ఇతర ప్రాంతాలలో నివసించే వారిలో అత్యధికంగా వృద్థులు తప్పించుకునే వీలు లేకపోవడంతో మంటలకు ఆహుతి అయి ఉంటారని ఆందోళన చెందుతున్నారు. చాలా మంది పెద్దలు వాహనాలలోనే వాటితో పాటే కాలి బూడిద అయ్యారు. తరుముకొచ్చే మంటల నుంచి తప్పించుకునే శక్తి లేకపోవడంతోనే వారు దుర్మరణం చెందినట్లు వెల్లడైంది. చాలా మంది ఆనవాళ్లు లేకుండా తగులబడటంతో గల్లంతయిన జాబితాలోని వారి సమీప బంధువుల డిఎన్‌ఎలను తీసుకుని మృతులను గుర్తించే ప్రక్రియ సాగుతోంది. ప్యారడైజ్ పట్టణం పూర్తిగా బూడిద అయింది. అన్ని ఇళ్లు కాలిపొయ్యాయని. అత్యంత వేగంగా కమ్మకున్న జ్వాలలతో ప్రజలు దిక్కుతోచని స్థితిని అనుభవించారని వెల్లడైంది. ఏ ప్రాంతంలో ఎంత మంది మిగిలి ఉన్నారు? ఎన్ని ఇళ్లు దెబ్బతిన్నాయనేది లెక్కించడానికి అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. మరోవైపు కార్చిచ్చును పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి.

Fire death toll hits 63 and more than 600 people missing

Telangana News

Related Stories: