లంక పార్లమెంట్‌లో తెగని తంటా

కొలంబో : శ్రీలంక పార్లమెంట్‌లో శుక్రవారం కూడా గందరగోళం నెలకొంది. వివాదాస్పద ప్రధాని రాజపక్స విధేయులైన ఎంపిలు ఏకంగా స్పీకర్ కరూ జయసూరియా కుర్చీపై కూర్చున్నారు. నినాదాలకు దిగారు. దీనితో వారిని సభ నుంచి బయటకు పంపించేందుకు స్పీకర్ పోలీసులను సభలోకి పిలిపించాల్సి వచ్చింది. మరో వైపు స్పీకర్ సభను సోమవారం వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. శ్రీలంకలో గత కొద్ది రోజులుగా రాజకీయ సంక్షోభం నెలకొని ఉంది. అక్రమంగా అధికారంలోకి వచ్చిన రాజపక్సపై అవిశ్వాసం […]

కొలంబో : శ్రీలంక పార్లమెంట్‌లో శుక్రవారం కూడా గందరగోళం నెలకొంది. వివాదాస్పద ప్రధాని రాజపక్స విధేయులైన ఎంపిలు ఏకంగా స్పీకర్ కరూ జయసూరియా కుర్చీపై కూర్చున్నారు. నినాదాలకు దిగారు. దీనితో వారిని సభ నుంచి బయటకు పంపించేందుకు స్పీకర్ పోలీసులను సభలోకి పిలిపించాల్సి వచ్చింది. మరో వైపు స్పీకర్ సభను సోమవారం వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. శ్రీలంకలో గత కొద్ది రోజులుగా రాజకీయ సంక్షోభం నెలకొని ఉంది. అక్రమంగా అధికారంలోకి వచ్చిన రాజపక్సపై అవిశ్వాసం నెగ్గిందని, ప్రస్తుతం ప్రధాని కానీ, ప్రభుత్వం కానీ లేదని స్పీకర్ వెల్లడించడం పరిస్థితి తీవ్రతకు తార్కాణంగా మారింది.

రాజపక్సపై అవిశ్వాసం నెగ్గిన విషయాన్ని స్పీకర్ గురువారమే అధికారికంగా దేశాధ్యక్షులు మైత్రీపాల సిరిసేనకు తెలిపారు. రాజ్యాంగపరంగా తక్షణ తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తరుణంలోనే శుక్రవారం జరిగిన పార్లమెంట్ సమావేశాలు ఆద్యంతం నిరసనలు నినాదాలతో సాగాయి. గురువారం బలపరీక్ష సమయంలో చోటుచేసుకున్న ఘటనలో శుక్రవారం కూడా పునరావృతం అయ్యాయి. గత నెలలో దేశాధ్యక్షులు సిరిసేన రాజపక్సను ప్రధానిగా నియమించారు. ఇది వివాదానికి దారితీసింది. సభలో బల పరీక్షకు అనుమతిని ఇచ్చారు. ఈ బలపరీక్షలో రాజపక్స ఓడినట్లు స్పీకర్ ప్రకటించగా దీనిని ఆమోదించేది లేదని ఆయన వర్గీయులు పేర్కొన్నారు. శుక్రవారం అసాధారణ రీతిలో రాజపక్స అనుకూల ఎంపీలు స్పీకర్ సీటును ఆక్రమించి సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు.

స్పీకర్‌ను నిందిస్తూ నినాదాలకు దిగారు. దీనితో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ దశలో స్పీకర్ ఆదేశాలతో పోలీసులు పార్లమెంట్ ఛాంబర్‌లోపలికి ప్రవేశించారు. ఎంపీలను బయటకు పంపించేందుకు యత్నించారు. అంతకుముందు సభలో గందరగోళం పతాక స్థాయికి చేరింది. పలువురు ఎంపీలు స్పీకర్ స్థానాన్ని చుట్టుముట్టడం, ఒక ఎంపీ దానిపై కూర్చోవడంతో దేశ పార్లమెంట్ చరిత్రలో కనివిని ఎరుగని పరిణామాలు చోటుచేసుకున్నాయి. గురువారం ముష్టిఘాతాలకు దిగిన ఎంపీలు శుక్రవారం పరస్పరం కలియబడ్డారు. దీనితో సీనియర్ ఎంపి జెమిని జయవిక్రమ పెరెరా గాయపడ్డారు. ఇక శుక్రవారం పోలీసులు స్పీకర్‌కు సభలో భద్రత కల్పించారు. ఈ దశలోనే ఆయన సభా కార్యకలాపాలను నిర్వహించేందుకు విఫల యత్నం చేశారు. ఈ దశలో సభను వాయిదా వేశారు.

Constitutional confusion in Sri Lanka Parliament

Telangana News