కుప్పకూలిన కివీస్

అబుదాబి: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య పాకిస్థాన్ జట్టు శుక్రవారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇమాముల్ హక్ (6), మహ్మద్ హఫీజ్ (20) ఇప్పటికే పెవిలియన్ చేరారు. హారిస్ సోహైల్ 22(బ్యాటింగ్), అజహర్ అలీ 10 (బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కాగా, కివీస్ మొదటి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే పాక్ […]

అబుదాబి: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య పాకిస్థాన్ జట్టు శుక్రవారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇమాముల్ హక్ (6), మహ్మద్ హఫీజ్ (20) ఇప్పటికే పెవిలియన్ చేరారు. హారిస్ సోహైల్ 22(బ్యాటింగ్), అజహర్ అలీ 10 (బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కాగా, కివీస్ మొదటి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే పాక్ మరో 94 పరుగులు చేయాలి. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్‌కు ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. పాక్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ కివీస్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు.

కెప్టెన్ కానె విలియమ్సన్ మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు. మిగతావారు విఫలమయ్యారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ 112 బంతుల్లో 5ఫోర్లతో 63 పరుగులు చేశాడు. హెన్రీ నికోలస్ (28) కాస్త రాణించగా ఇతర బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. పాక్ బౌలర్లలో యాసిర్‌షా అత్యధికంగా మూడు వికెట్లు తీశాడు. మహ్మద్ అబ్బాస్, హారిస్ సోహైల్, హసన్ అలీ రెండేసి వికెట్లు పడగొట్టారు. కాగా, తొలి రోజు ఏకంగా 12 వికెట్లు నేల కూలాయి. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా మారడంతో పాక్‌కు కూడా ఇబ్బందులు తప్పక పోవచ్చు. ఒక వేళ భారీ ఆధిక్యం సాధించక పోతే పాక్‌కు ఇబ్బందులు ఖాయమని చెప్పాలి. ఎందుకంటే చివరి ఇన్నింగ్స్‌లో లక్ష ఛేదన అంత సులువుకాదు. దీనికి తోడు కివీస్‌లో అగ్రశ్రేణి బౌలర్లు ఉండడంతో ఇది రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి.

New Zealand defeat in the first Test against Pakistan

Telangana Latest News