మిథాలీ మరో రికార్డు

గయానా: మహిళల క్రికెట్‌లో భారత సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ మరో రికార్డును సాధించింది. పురుషుల ట్వంటీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్) పేరిట ఉన్న రికార్డును మిథాలీ తిరగరాసింది. ఇప్పటికే అంతర్జాతీయ టి20లలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ పేరున ఉన్న (2207) రికార్డును మిథాలీ బద్దలు కొట్టింది. తాజాగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా మార్టిన్ గుప్టిల్ పేరిట ఉన్న అత్యధిక పరుగులు (2271) రికార్డును […]

గయానా: మహిళల క్రికెట్‌లో భారత సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ మరో రికార్డును సాధించింది. పురుషుల ట్వంటీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్) పేరిట ఉన్న రికార్డును మిథాలీ తిరగరాసింది. ఇప్పటికే అంతర్జాతీయ టి20లలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ పేరున ఉన్న (2207) రికార్డును మిథాలీ బద్దలు కొట్టింది. తాజాగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా మార్టిన్ గుప్టిల్ పేరిట ఉన్న అత్యధిక పరుగులు (2271) రికార్డును సైతం మిథాలీ బ్రేక్ చేసింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించిన మిథాలీ భారత్‌ను సెమీస్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం మిథాలీ 2283 పరుగులతో మహిళల టి20 అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ సుజీ బేట్స్ (2996) అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Indian Mithali Raj is another record in women cricket

Telangana Latest News

Related Stories: