కొత్త నైపుణ్యాలు పెంచుకుంటే ప్రయోజనం

కాలనుగుణంగా మారుతున్న ఆధునిక ప్రపంచంలో రాణించాలంటే ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థుల్లా మారాల్సిందే. తాము పనిచేస్తున్న రంగంలో వస్తున్న మార్పులను నిరంతరం అధ్యయనం చేయడంతో పాటు వీలైనంత వరకు లేటెస్ట్ స్కిల్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో సిద్ధంగా ఉన్నప్పుడే మీకంటూ ఓ గుర్తింపు లభిస్తుంది. అయితే ఈ నేర్చుకునే ప్రక్రియలో మీ రోజువారి కార్యకలాపాలకు మాత్రం ఎలాంటి ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఉద్యోగస్తులైనా, విద్యార్థులైనా సమయాన్ని సద్వినియోగం చేసుకునే మార్గాలపై దృష్టిపెట్టండి. కొత్త […]

కాలనుగుణంగా మారుతున్న ఆధునిక ప్రపంచంలో రాణించాలంటే ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థుల్లా మారాల్సిందే. తాము పనిచేస్తున్న రంగంలో వస్తున్న మార్పులను నిరంతరం అధ్యయనం చేయడంతో పాటు వీలైనంత వరకు లేటెస్ట్ స్కిల్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో సిద్ధంగా ఉన్నప్పుడే మీకంటూ ఓ గుర్తింపు లభిస్తుంది. అయితే ఈ నేర్చుకునే ప్రక్రియలో మీ రోజువారి కార్యకలాపాలకు మాత్రం ఎలాంటి ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఉద్యోగస్తులైనా, విద్యార్థులైనా సమయాన్ని సద్వినియోగం చేసుకునే మార్గాలపై దృష్టిపెట్టండి. కొత్త నైపుణ్యాల సాధన ముఖ్యం అని అందరూ చెబుతూనే ఉంటారు. కానీ ఉదయం నుంచి రాత్రి వరకూ పని హడావుడిలో ఉండేవారికి ఇదెలా సాధ్యం అనేదే ప్రశ్న. మనసుంటే మార్గం కూడా ఉంటుంది. మీలో నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే మార్గాలు అవే దొరుకుతాయి.

ఇంటర్నెట్‌ను ఆశ్రయించండి
మీరు ఏ రంగానికి సంబంధించిన నూతన పరిజ్ఞానం నేర్చుకోవాలన్నా ఇంటర్నెట్ ఉత్తమ సాధనం. నేడు దీం ట్లో దొరకని సబ్జెక్ట్ లేదంటే అతిశయోక్తి కాదు. ఇంట ర్నెట్‌లో మీ శిక్షణకు అవసరమైన మెటీరియల్ కోసం ప్రయత్నించి చూడండి. ఆన్‌లైన్ లైబ్రరీలు, ఆన్‌లైన్ బుక్ సర్వీసలు నేడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇక యూట్యూబ్‌లో వీడియో పాఠాలు సరేసరి.

విరామాలను సద్వినియోగం చేసుకోండి
ఏ బ్రేక్ అయినా సరే 20 నిమిషాలు ముందే ముగించండి. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వెబ్‌సైట్లను చూస్తూ కాలక్షేపం చేసేబదులు ఆ సమయాన్ని ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి వినియోగించండి. శిక్షణకు సంబంధించి మీ సెల్‌ఫోన్‌లో ఆప్‌లోడ్ చేసుకున్న వీడియోలు చూడండి. మీకు తెలియని విషయాలు నేర్చుకునే ప్రయత్నించండి.

పంచుకోండి… పెంచుకోండి
కొత్తగా తెలుసుకున్నదాన్ని సహోద్యోగులతో షేర్ చేసుకోండి. మీరు కొత్తగా నేర్చుకున్న/తెలుసుకున్న ఏ విషయమైనా సరే, దాన్ని తోటి ఉద్యోగులకు చెప్పండి. మార్కెట్‌లో ఉన్న కొత్త కోర్సుల వివరాలను వారితో పంచుకోండి. అందరూ కలిసి చర్చించుకుంటే టీం స్పిరిట్ పెరుగుతుంది. మీకూ అంతవ రకూ తెలియని చాలా కొత్త విషయాలు అర్థమవుతాయి. ఒక్కో అంశంపై రోజుకి ఒకరు మాట్లాడేలా ప్రణాళిక వేసుకోండి.

వారాంతపు సెలవుల్లో…
నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి పండుగ సెలవులు, వారాంతపు రోజుల్లో మరింత సమయం కేటాయించడం ద్వారా వృత్తిపరమైన ఎదుగుదలకు బాటలు వేసుకోండి. ఈ రోజుల్లో మీరు నేర్చుకున్న అంశం ఆ మర్నాడు కార్యాల యానికి నూతనోత్సాహంతో వెళ్లడానికి ఓ ఔషధంలా పనిచేస్తుంది.

Internet is the best tool to learn new knowledge

Telangana Lates News