తల్లి ఉద్యోగంతో పిల్లలకు మంచి వ్యక్తిత్వం..

ఈ రోజుల్లో 24 గంటలూ సరిపోనంత బిజీగా ఉంటున్నారు భార్యాభర్తలు. అయితే కుటుంబం, పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నారనే దాంతో ఉద్యోగం మానేస్తే మంచిదనే చర్చ జరుగుతుంటుంది. అయితే ఈ రెండింటిని సమన్వయం చేసుకోగలగడం కత్తిమీద సాము లాంటిది. దీనిపై ఇప్పటికే చాలా పరిశోధనలు జరిగాయి. మహిళలు ఉద్యోగం చేయడం వల్ల కుటుంబానికి ఆర్థికంగానే కాదు, పిల్లలకు మంచి వ్యక్తిత్త్వం ఏర్పడుతుంది. ఇటీవల హార్వర్డ్ విశ్వవిద్యాలయం 25 దేశాల్లోని ఉద్యోగినుల కుటుంబాలకు చెందిన 50 వేల మంది […]

ఈ రోజుల్లో 24 గంటలూ సరిపోనంత బిజీగా ఉంటున్నారు భార్యాభర్తలు. అయితే కుటుంబం, పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నారనే దాంతో ఉద్యోగం మానేస్తే మంచిదనే చర్చ జరుగుతుంటుంది. అయితే ఈ రెండింటిని సమన్వయం చేసుకోగలగడం కత్తిమీద సాము లాంటిది. దీనిపై ఇప్పటికే చాలా పరిశోధనలు జరిగాయి. మహిళలు ఉద్యోగం చేయడం వల్ల కుటుంబానికి ఆర్థికంగానే కాదు, పిల్లలకు మంచి వ్యక్తిత్త్వం ఏర్పడుతుంది. ఇటీవల హార్వర్డ్ విశ్వవిద్యాలయం 25 దేశాల్లోని ఉద్యోగినుల కుటుంబాలకు చెందిన 50 వేల మంది పిల్లలపై అధ్యయనం చేసింది. ఆ పిల్లల్లో అధికశాతం ఇప్పటి సామాజిక పరిస్థితులను అంగీకరిస్తున్నట్లు తెలిసింది. వీరంతా ఉద్యోగం చేసే తల్లిని రోల్‌మోడల్‌గా భావిస్తున్నట్లు తేలింది. ఆ పిల్లలు పెద్దయ్యాక విధుల్నీ విజయవంతంగా నిర్వర్తిస్తున్నారని ఈ అధ్యయనం తేల్చింది. వీరిలో చిన్నవయసు నుంచీ పరిణితి కనిపిస్తోందని ఈ అధ్యయనంలో తేలింది.

1. మగపిల్లలు ఇంట్లో అమ్మకు సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు. పెద్దయ్యాక బాధ్యతాయుతమైన భర్తగా, మంచి తండ్రిగా మారుతున్నారు.

2. యువకులు తమ భాగస్వాములను ఎంపిక చేసుకునేటప్పుడు ఉద్యోగం చేసే అమ్మాయిలకు ప్రాధాన్యం ఇస్తారని ఈ అధ్యయనంలో తేలింది. అమ్మాయిలు కూడా తాము మగవారి కన్నా ఏ మాత్రం తక్కువ కాదనీ, వారితో సమానమనే భావన పెంచుకుంటున్నారు. అది వారికి భవిష్యత్తులో ఉపయోగపడుతుందనీ అధ్యయనకర్తలు చెబుతున్నారు. ఇంటి బాధ్యతలతో సహా ఉద్యోగబాధ్యతలను విజయవంతంగా నిర్వహించే సామర్థ్యాన్ని అమ్మాయిలు తల్లుల్ని చూసి నేర్చుకుంటారట. చదువూ, కెరీర్ విషయంలో సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తమ ప్రతిభతో అధిక వేతనాలను కూడా పొందగలుగుతారు. కాబట్టి ఉద్యోగం మానేయడమే పరిష్కారం అనుకోకుండా పిల్లలతో గడిపేందుకు ఏ మాత్రం సమయం దొరికినా ప్రణాళిక వేసుకుని వారితో గడపండి.

Women job are good personality for the family and children

Telangana Latest News