రాజకీయ బానిసత్వంలో బిసిలు

తెలంగాణ రాష్ట్రంలో బిసిల జనాభా నూటికి యాభై ఆరు శాతం, 119 నియోజక వర్గాల్లో గెలుపును శాసించే శక్తి బిసి కులాలదే. లక్ష నుండి లక్షా యాభైవేల జనాభా వరకు ఉన్న నియోజక వర్గాలు ఉన్నా, ఎన్నికల సమయంలో ఆశావాహ బిసి అభ్యర్ధులు పార్టీల చు ట్టూ, అధినాయకత్వం చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసినా టికెట్లు రాక, నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. దీనంతటికీ కారణం బిసి కులాలలో రాజకీయ చైతన్యం, ఓటు స్పృహ లేకపోవడమే. ఓటును గుర్తించిన […]

తెలంగాణ రాష్ట్రంలో బిసిల జనాభా నూటికి యాభై ఆరు శాతం, 119 నియోజక వర్గాల్లో గెలుపును శాసించే శక్తి బిసి కులాలదే. లక్ష నుండి లక్షా యాభైవేల జనాభా వరకు ఉన్న నియోజక వర్గాలు ఉన్నా, ఎన్నికల సమయంలో ఆశావాహ బిసి అభ్యర్ధులు పార్టీల చు ట్టూ, అధినాయకత్వం చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసినా టికెట్లు రాక, నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. దీనంతటికీ కారణం బిసి కులాలలో రాజకీయ చైతన్యం, ఓటు స్పృహ లేకపోవడమే. ఓటును గుర్తించిన యం.ఐ.యం. లాంటి ముస్లిం రాజకీయ పార్టీలు, పాతబస్తీ లాం టి నగరాలలో మతపరమైన ఓటు బ్యాంకు దశాబ్దాలుగా రాజకీయ ప్రాబల్య శక్తిగా తయారయ్యారు. నేటికీ చట్టసభల్లో కొనసాగుతున్నారు.

దీనంతటికీ కారణం ఓటు చైతన్యం వారికి తెలిసి రావడమే. బిసి కులాల్లో ఈ చైతన్యం లేకనే రాజకీయ బానిసత్వం, ఆయా పార్టీలలో దశాబ్దాలుగా సేవలు చేసినా, రాజకీయ పాలేరులుగా కొనసాగడం, టికెట్ల పంపిణీకి వచ్చేసరికి బిసిలకు మొండిచెయ్యి చూపడం జరుగుతున్నది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, బిసిలను, బిసి ప్రజా ప్రతినిధులను తీవ్ర మనస్తాపానికి గురిచేసే విధంగా ఉన్నవి. ముఖ్యంగా మునుగోడు, జనగామ నియోజక వర్గాలలో చెరుకు సుధాకర్, పొన్నాల లక్ష్మయ్యలపై జరుగుతున్న రాజకీయ దాడి, బిసి సామాజిక వర్గాలను రాజకీయ ఆధిపత్య పెత్తందారీ వర్గాలకు సంబంధించిన వర్గాలు ఏ విధంగా అణచివేతకు గురి చేస్తున్నవో తెలుస్తున్నది.పొన్నాల లక్ష్మయ్య బిసి కులాల్లో అన్ని విధాలుగా ఎదిగి, కాంగ్రెస్ పార్టీకి మాజీ అధ్యక్షుడిగా ఉన్నారు.

అతడికే టికెట్ విషయంలో అవమానాలు తప్పలేదు. ఇప్పటికీ టికెట్ వస్తుందా, రాదా అన్న సంక్షోభ స్థితిలో ఉన్నారు. మిగతా ఆశావాహుల పరిస్థితి ఏ విధంగా వుంటుందో అర్ధం చేసుకోవచ్చు. రాజకీయ పార్టీల టికెట్ల పంపిణీ విధానంలో ఏక ధ్రువ పద్ధతి పాటించడం వల్ల సామాజిక న్యాయం అనేది ఘోరాతిఘోరంగా హత్యకు గురి కాబడింది. ప్రధాన పార్టీలు అన్నీ కూడా ఒకే సామాజిక శిబిరానికి టికెట్లు కట్టబెడుతున్నారు. దానితో పాటు వారి రాజకీయ చైతన్యం, పలుకుబడి, వారి సామాజిక వర్గాన్ని విస్మరిస్తే మా పార్టీలను రాజకీయ సమాధి చేస్తారేమో అనే భయంతో, భక్తితో టికెట్లు ఇస్తున్నారు. ఆ విధంగా వారు రాజకీయాలను శాసిస్తున్నారు. అందుకే అన్ని పార్టీలు టికెట్లు ఆ సామాజిక వర్గానికే కట్టబెడుతున్నవి. దీనిని బిసి కుల ప్రజాప్రతినిధులు గుర్తించకపోవడం ప్రధాన కారణం.

ఆయా పార్టీలలో ఉన్న బిసి నాయకులు, బిసిలలో సామాజిక విద్య, సామాజిక చైతన్యం పెంచి కొంతమేర ఖర్చుపెట్టి రాజకీయ శిక్షకులుగా కార్యకర్తలను తయారుచేసుకొనే పరిస్థితి నేటికీ లేదు. బిసి ఉద్యమ నాయకత్వం, కుల సంఘాలు నేటి దుస్థితిపై పునఃపరిశీలన, ఆత్మావలోకనం చేసుకోవలసిన చారిత్రక సందర్భం ఇది. బిసిల ఉద్యమం 50 సం॥ల చరిత్ర కలిగింది, మలిదశ తెలంగాణ ఉద్యమం రెండు దశాబ్దాల చరిత్ర కలిగినది. ఈ రెండు ఉద్యమాలను పరిశీలించినపుడు 50 సం॥ల బిసి ఉద్యమానికి నేటికి రాజకీయ వేదిక లేదు. ఒక సిద్ధాంత భూమిక లేదు, సాంస్కృతిక వేదికలు, సాహిత్యం, సుశిక్షితులు అయిన ఉద్యమ కార్యకర్తలు, కవులు, కళాకారులు అరకొరగానే ఉన్నారు.

ఉద్యమ నాయకత్వంలో సంకుచిత భావం, స్వార్ధం, భయం పేరుకు పోవడం వల్ల పోరాట పంథాను క్రిందిస్థాయి వరకు తీసుకుపోయే చురుకుతనంలేక చతికిలపడింది. దీని నుండి బిసి సంఘాలు, బిసి కుల సంఘాలు బయటపడాలి. బిసిలలోని అనేక మంది విద్యావంతులు, వ్యాపారవేత్తలు, మేధావులు, కవులు, కళాకారులు బయటికి వచ్చి బిసి విప్లవాన్ని తీసుకు రావలసిన అవసరం ఉంది. అందుకు మలిదశ తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలి. బిసిలు సమగ్ర అభివృద్ధి సాధించాలంటే చట్టసభల్లో వారికి సరైన ప్రాతినిధ్యం అవసరం. అందుకు ఓటు చైతన్యంతో పాటు ఓటును ఆయుధంగా మలచుకొని రాజకీయ శక్తిగా బిసి సమాజం ఎదగాలి. రాజకీయాలను ఆశించడం కాకుండా శాసించే శక్తిగా బిసిలు ఎదగాలి.

BC population in Telangana state is fifty six per cent

Telangana Latest News