పేదరిక నిర్మూలనకే అధిక వృద్ధి రేటు

25వ వరల్డ్ డబ్లూఎస్‌బిఐ కాంగ్రెస్ సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ న్యూఢిల్లీ: పేదరిక నిర్మూలనకు అధిక వృద్ధి రేటు అవసరమని, అభివృద్ధి ఫలాలు పేదలకు అందేలా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఇక్కడ 25వ సేవింగ్, రిటైల్ బ్యాంక్‌ల వరల్డ్ కాంగ్రెస్ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల జీవన నాణ్యత మెరుగుపర్చేందుకు వృద్ధి ఫలాల కోసం సమాజం నిరవధికంగా వేచి ఉండబోదని అన్నారు. ‘ప్రపంచంలో […]

25వ వరల్డ్ డబ్లూఎస్‌బిఐ కాంగ్రెస్ సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ

న్యూఢిల్లీ: పేదరిక నిర్మూలనకు అధిక వృద్ధి రేటు అవసరమని, అభివృద్ధి ఫలాలు పేదలకు అందేలా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఇక్కడ 25వ సేవింగ్, రిటైల్ బ్యాంక్‌ల వరల్డ్ కాంగ్రెస్ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల జీవన నాణ్యత మెరుగుపర్చేందుకు వృద్ధి ఫలాల కోసం సమాజం నిరవధికంగా వేచి ఉండబోదని అన్నారు. ‘ప్రపంచంలో భారత్ వంటి ఆర్థిక వ్యవస్థలు అధిక వృద్ధి రేటును సాధించాల్సిన అవసరం ఉంది. పేదరిక నిర్మూలనకు, వారి జీవన నాణ్యతను మెరుగుపర్చేందుకు ఒక యంత్రాంగంగా వృద్ధిని మనం వినియోగించుకోవాలి. అయితే ఈ ఫలాలు అందరికీ అందడం లేదు’ అని జైట్లీ అన్నారు. వృద్ధి ప్రభావం నెమ్మదిగా ఉంటుందని, అయితే నెమ్మది ప్రక్రియ, ఆశావాహ సమాజం నిరవధికంగా వేచి ఉండబోదని జైట్లీ అన్నారు.

బ్యాంకింగ్ వ్యవస్థ, నిధులు, సేవలు సరిగాలేవని.. 2014 నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టిందని అన్నారు. బ్యాంకులు, ప్రత్యేకించి ప్రభుత్వరంగ బ్యాంకులు.. కొద్ది నెలల్లోనే ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన(పిఎంజెడివై) కింద 33 కోట్ల ఖాతాలు తెరిచాయని జైట్లీ పేర్కొన్నారు. తొలుత సున్నా బ్యాలెన్స్‌తో ఖాతాలు ఉంటే.. క్రమక్రమంగా వాటిలో ప్రజలు సొమ్మును దాచుకోవడం మొదలుపెట్టారని అన్నారు. మొత్తం 14.1 కోట్ల మంది ప్రమాద బీమా కింద పేరు నమోదు చేసుకోగా, 5.5 కోట్ల మంది జీవిత బీమా కింద పేరు నమోదు చేసుకున్నారని అన్నారు.

Jaitley at the 25th World WSBI Congress Summit

Telangana Latest News

Related Stories: