ప్రత్యేక రోజుల్లో మహిళలకు దర్శనం?

తిరువనంతపురం: శబరిమలను పదినుంచి యాభై ఏళ్ల మధ్య వయసు మహిళలు ప్రత్యేక రోజుల్ల్లో దర్శించునేలా ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు.ఈ విషయాన్ని అమలు చేసే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని చర్చించేందుకు తాను ఆలయ ప్రధాన పూజారి, పందలం రాజవంశీకుల ప్రతినిధులను కూడా కలవనున్నట్లు ఆయన చెప్పారు. శబరిమల వివాదంపై చర్చించడానికి గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. సమావేశం అనంతరం విజయన్ విలేఖరులతో మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశంలోనూ […]

తిరువనంతపురం: శబరిమలను పదినుంచి యాభై ఏళ్ల మధ్య వయసు మహిళలు ప్రత్యేక రోజుల్ల్లో దర్శించునేలా ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు.ఈ విషయాన్ని అమలు చేసే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని చర్చించేందుకు తాను ఆలయ ప్రధాన పూజారి, పందలం రాజవంశీకుల ప్రతినిధులను కూడా కలవనున్నట్లు ఆయన చెప్పారు. శబరిమల వివాదంపై చర్చించడానికి గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. సమావేశం అనంతరం విజయన్ విలేఖరులతో మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశంలోనూ తాను ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు చెప్పారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం వెనుక ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని ముఖ్యమంత్రి చెప్పారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ తమ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి తీరుతుందని చెప్పారు. ‘ఈ విషయంతో ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం లేదు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం తప్ప ప్రభుత్వానికి వేరే మార్గం లేదు. సుప్రీంకోర్టు రేపు మరో నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం దాన్ని కూడా అమలు చేస్తుంది’ అని ఆయన చెప్పారు. అయితే ప్రభుత్వం భక్తులకు అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. భక్తులందరికీ తమ ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని కూడా ఆయన చెప్పారు. ప్రభుత్వం కోర్టు తీర్పును మాత్రమే పాటిస్తోందని, భక్తులందరూ ఈ విషయాన్ని అర్థం చేపుకోవాలని కూడా ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ వాకౌట్
కాగా సమావేశంనుంచి తాము వాకౌట్ చేస్త్తున్నట్లు కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు రమేశ్ చెన్నితల ప్రకటిస్తూ, సుప్రీంకోర్టు తీర్పు అమలు విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, రాజీకి ఏ మాత్రం సిద్ధంగాలేదని ఆరోపించారు.ఇది భక్తులకు సవాలని ఆయన అన్నారు. అంతేకాదు, ప్రభుత్వం శబరిమలయాత్రను బలహీనం చేయడానికి ప్రయత్నిస్తోందని కూడా ఆయన ఆరోపించారు. కాగా, ప్రభుత్వం తీరును బిజెపి రా్రష్ట్ర అధ్యక్షుడు పిఎస్ శ్రీధరన్ దుయ్యబడ్తూ, అఖిల పక్ష సమావేశం వృథా కాలయాపన అని విమర్శించారు.సుప్రీంకోర్టు తీర్పుపై దాఖలయిన రివ్యూ పిటిషన్లు జనవరి 22న న్యాయస్థానంలో విచారణకు రానున్నందున అప్పటివరకు కోర్టు తీర్పు అమలును వాయిదా వేయాలని ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. అయితే ఈ డిమాండ్‌ను ముఖ్యమంత్రి పినరయి విజయన్ తోసిపుచ్చుతూ, సుప్రీంకోర్టు ఇచ్చి న తన తీర్పును నిలిపి వేయనందున రాబోయే మండల పూజ సందర్భంగా అన్ని వయసుల మహిళలను అమలు చేయడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం లేదని స్పష్టం చేశారు. దాదాపు రెండు నెలల పాటు జరిగే మండల పూజ కోసం 17న ఆలయాన్ని తిరిగితెరవనున్న నేపథ్యంలో 2 రోజుల ముందుగా ఆఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Sabarimala Visit for 50years Age women in special days?

Telangana News

Related Stories: