భారత్‌కు సవాలు వంటిదే

ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం స్టీవ్‌వా సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ టీమిండియాకు సవాలు వంటిదే నని ఆసీస్ మాజీ దిగ్గజం స్టీవ్‌వా జోస్యం చెప్పాడు. సీనియర్లు స్మిత్, వార్నర్‌లు లేకున్నా ఆస్ట్రేలియాను ఓడించడం భారత్‌కు అనుకున్నంత తేలిక కాదని స్టీవ్‌వా అభిప్రాయపడ్డాడు. సొంత గడ్డపై ఆస్ట్రేలి యాకు తిరుగులేని రికార్డు ఉందన్న విషయాన్ని వా గుర్తు చేశాడు. బ్యాటింగ్‌లో కాస్త బలహీనంగా ఉన్న తమ జట్టు బౌలింగ్‌లో మాత్రంగా చాలా పటిష్టంగా ఉందన్నాడు. సొంత గడ్డపై ఆస్ట్రేలియా […]

ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం స్టీవ్‌వా

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ టీమిండియాకు సవాలు వంటిదే నని ఆసీస్ మాజీ దిగ్గజం స్టీవ్‌వా జోస్యం చెప్పాడు. సీనియర్లు స్మిత్, వార్నర్‌లు లేకున్నా ఆస్ట్రేలియాను ఓడించడం భారత్‌కు అనుకున్నంత తేలిక కాదని స్టీవ్‌వా అభిప్రాయపడ్డాడు. సొంత గడ్డపై ఆస్ట్రేలి యాకు తిరుగులేని రికార్డు ఉందన్న విషయాన్ని వా గుర్తు చేశాడు. బ్యాటింగ్‌లో కాస్త బలహీనంగా ఉన్న తమ జట్టు బౌలింగ్‌లో మాత్రంగా చాలా పటిష్టంగా ఉందన్నాడు. సొంత గడ్డపై ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొని భారీ స్కోర్లు సాధించడం పర్యాటక జట్లకు కష్టమనే విషయాన్ని మరువ కూడదన్నాడు. గతంతో పోల్చితే భారత్ కాస్త బలంగా ఉన్నా మాటా వాస్తవమేనని, అయితే ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్ సొంతం చేసు కోవడం మాత్రం కష్టంతో కూడుకున్న విషయంగానే స్టీవ్‌వా అభివర్ణించాడు.

ఆస్ట్రేలియాలో పర్యటించే భారత జట్టుకు గట్టి పోటీ ఎదుర్కొవడం ఖాయమన్నాడు. గతంతో పోల్చితే కోహ్లి నేతృత్వంలోని జట్టు కాస్త బలహీనంగానే ఉందని స్టీవ్‌వా వివరించాడు. తాను ఎదుర్కొన్న అప్పటి భారత జట్లు చాలా బలంగా ఉండేవన్నాడు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్, ద్రవిడ్, జహీర్, కుంబ్లే, హర్భజన్ వంటి దిగ్గజాలతో అప్పటి భారత జట్టు చాలా పటిష్టంగా ఉన్న విషయాన్ని స్టీవ్‌వా గుర్తు చేశాడు. ప్రస్తుత భారత జట్టు బ్యాటింగ్ గతంలో లాగా అంత బలంగా ఏమీ లేదన్నాడు. ఒక్క కోహ్లి తప్ప మిగతావారు నిలకడగా రాణించడంలో విఫలమవుతున్నారన్నాడు. ఇందుకు ఇంగ్లండ్ సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్ ప్రదర్శనే నిదర్శనమన్నాడు. ఇంగ్లండ్‌లోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న భారత బ్యాట్స్‌మెన్‌లకు ఆసీస్ గడ్డపై మరింత సమస్యలు ఎదురు కావడం ఖాయమన్నాడు.

టీమిండియా ప్రధాన కోచ్  రవిశాస్త్రి పేర్కొంటున్నట్టు ప్రస్తుత భారత జట్టే అత్యుత్తమైందనడంలో నిజం లేదన్నాడు. గతంలో ఉన్న జట్లు ఇంతకంటే చాలా బలంగా ఉండేవని స్టీవ్‌వా అభిప్రాయపడ్డాడు. అప్పట్లో బ్యాటింగ్  చాలా బలంగా ఉండేదన్నాడు. ఒకరు విఫలమైతే మరోకరూ జట్టుకు అండగా నిలిచే వారన్నాడు. అయితే ప్రస్తుత భారత జట్టు  బ్యాటింగ్ మొత్తం కోహ్లి చుట్టే తిరుగుతుందన్నాడు. అతను త్వరగా ఔటైతే వికెట్లు టపటపా రాలి పోతున్న విషయాన్ని మరువ కూడదన్నాడు. కాగా, స్మిత్, వార్నర్‌లు లేని లోటును పూడ్చడం అనుకున్నంత  తేలిక కాదన్నాడు. అయినా భారత్‌ను ఓడించే సత్తా ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టుకు ఉందన్నాడు.

 Challenges to Team India with Series against Australia

Telangana Latest News

Related Stories: