కాంగ్రెస్ వారే ఇండ్లను అమ్ముకున్నారు

మన తెలంగాణ/బాలాపూర్ : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాలాజినగర్‌లో ఇచ్చిన ఇండ్ల పట్టాలను ఆ పార్టీ నాయకులు అమ్ముకొని ఇక్కడ నివసించే రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలను మోసం చేశారని మహేశ్వరం నియోజకవర్గ టిఆర్‌ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బడంగ్‌పేట్ మున్సిపాలిటి పరిధిలోని మల్లాపూర్, సుల్తాన్‌పూర్, రేణుకాపూర్, బాలాజినగర్, వెంకటాపూర్ గ్రామాల్లో బుధవారం సాయంత్రం, ఆల్మాస్‌గూడ వినాయక హిల్స్ ఫేజ్-_1, 2, 3, తిరుమల హిల్స్‌లలో గురువారం పర్యటించారు. ఈ […]

మన తెలంగాణ/బాలాపూర్ : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాలాజినగర్‌లో ఇచ్చిన ఇండ్ల పట్టాలను ఆ పార్టీ నాయకులు అమ్ముకొని ఇక్కడ నివసించే రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలను మోసం చేశారని మహేశ్వరం నియోజకవర్గ టిఆర్‌ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బడంగ్‌పేట్ మున్సిపాలిటి పరిధిలోని మల్లాపూర్, సుల్తాన్‌పూర్, రేణుకాపూర్, బాలాజినగర్, వెంకటాపూర్ గ్రామాల్లో బుధవారం సాయంత్రం, ఆల్మాస్‌గూడ వినాయక హిల్స్ ఫేజ్-_1, 2, 3, తిరుమల హిల్స్‌లలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా తీగల మాట్లాడుతూ నియోజకవర్గంలో మంచినీటి సమస్య ఉన్న ప్రాంతాలకు మిషన్ భగీరధ పథకం ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తామన్నారు.

టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత బడంగ్‌పేట మున్సిపాలిటిని కొట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేశామన్నారు. దినదిన ప్రవర్ధమనమౌతున్న కాలనీల కారణంగా ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, డిసెంబర్ 7వ తేదిన జరగనున్న ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరాన్ని అభివృద్ధిలో నెంబర్1 స్థానంలో నిలబెట్టి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరిని పలుకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు సామ నర్సింహ్మాగౌడ్, కర్రె కృష్ణ, బొర్ర జగన్‌రెడ్డి, వంగేటి లకా్ష్మరెడ్డి, రాళ్లగూడెం శ్రీనివాస్‌రెడ్డి, సింగిరెడ్డి పెంటారెడ్డి, జక్కిడి విష్ణువర్ధన్‌రెడ్డి, ఏనుగు రాంరెడ్డి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Congress Govt Cheating Peoples

Telangana News

Related Stories: