గిరిజనుల అభ్యున్నతే కెసిఆర్ లక్ష్యం

ఏన్కూరు ప్రచార సభల్లో బానోత్ మదన్‌లాల్ మన తెలంగాణ/ఖమ్మం/వైరా/ఏన్కూరు : తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా గిరిజనుల అభ్యున్నతి కోసం రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహర్నిశలు కృషి చేస్తున్నారని వైరా అసెంబ్లీ టిఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ శాసనసభ్యులు బానోత్ మదన్‌లాల్ అన్నారు. గురువారం ఏన్కూరు మండలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత మండలంలో బిక్యాతండాలో ప్రారంభమైన ప్రచారం రాయమాదారం, మర్సకుంట, రాంనగర్‌తండా, మూలపోచారం, రంగాపురం, తిమ్మారావుపేట, ఎర్రబోడుతండా, రాజలింగాల, బురదరాఘవాపురం, కోదండరాంపురం, లచ్చగూడెం, శ్రీరామగిరి, ఆరికాయలపాడు […]

ఏన్కూరు ప్రచార సభల్లో బానోత్ మదన్‌లాల్
మన తెలంగాణ/ఖమ్మం/వైరా/ఏన్కూరు : తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా గిరిజనుల అభ్యున్నతి కోసం రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహర్నిశలు కృషి చేస్తున్నారని వైరా అసెంబ్లీ టిఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ శాసనసభ్యులు బానోత్ మదన్‌లాల్ అన్నారు. గురువారం ఏన్కూరు మండలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత మండలంలో బిక్యాతండాలో ప్రారంభమైన ప్రచారం రాయమాదారం, మర్సకుంట, రాంనగర్‌తండా, మూలపోచారం, రంగాపురం, తిమ్మారావుపేట, ఎర్రబోడుతండా, రాజలింగాల, బురదరాఘవాపురం, కోదండరాంపురం, లచ్చగూడెం, శ్రీరామగిరి, ఆరికాయలపాడు గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామాల్లోని ప్రజలు అడుగడుగునా హారతులు పట్టి అపూర్వ స్వాగతం పలికారు. వాడవాడలా కెసిఆర్‌కు మద్దతు తెలుపుతూ టిఆర్‌ఎస్‌ను గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు.

మదన్‌లాల్ ప్రచార కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు లభిస్తుండగా స్వచ్ఛందంగా కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు సైతం అండగా నిలుస్తూ టిఆర్‌ఎస్ చేరుతున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రచార సభల్లో మదన్‌లాల్ మాట్లాడుతూ వైరా నియోజకవర్గ అభివృద్ధికి కెసిఆర్ సుమారుగా రూ.300 కోట్లకు పైగా నిధులు కేటాయించారని చెప్పారు. రైతన్నలకు రైతు బంధు కింద ఎకరాకు రూ.8వేలు ఇస్తున్నారని రానున్న ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే రూ.10వేలు చొప్పున ఎకరాకు పెట్టుబడి సాయంగా అందిస్తామన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో టిఆర్‌ఎస్ జిల్లా నాయకులు గుత్తా వెంకటేశ్వరరావు, మండలాధ్యక్షులు జి.సత్యనారాయణ, మార్కెట్ చైర్మన్ సక్రూ నాయక్, మోహన్‌రావు, ఆదిభాస్కర్‌రావు, రమేష్, వీరునాయక్, ఎల్లయ్య, జనార్ధన్, కట్టా సత్యనారాయణ, మేడ ధర్మారావు, కె.వెంకటేశ్వరరావు, లక్ష్మణ్‌రావు, మన్నేపల్లి శ్రీనివాసరావు, మన్నేపల్లి శ్వేత, సీత తదితరులు పాల్గొన్నారు.
 మహిళల ఇంటింటా ప్రచారం :
వైరా నియోజకవర్గ టిఆర్‌ఎస్ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్‌కు సంఘీభావంగా వైరా కూరగాయల మార్కెట్, న్యూబస్టాండ్‌తో పాటు పలు వార్డుల్లో టిఆర్‌ఎస్ మహిళా విభాగం నేతలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందిస్తుందని ప్రచారంలో వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైరా పట్లణ టిఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు మాదినేని సునిత, నాయకురాళ్లు పెరుగు నాగమణి, తన్నీరు జ్యోతి, తన్నీరు కృష్ణవేణి, తేజశ్విని, జయ తదితరులు పాల్గొన్నారు.

Kcr main target of tribals development

Telangana News

Related Stories: