కీసరలో ముగ్గురు విద్యార్ధునుల అదృశ్యం

కీసర: కీసరలో ముగ్గురు ఇంటర్ చదువుతున్న విద్యార్ధునులు అదృశ్యమైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండల కేంద్రమైన కీసరలోని నందిని నగర్ కాలనీకి చెందిన ఆలకుంట గీత (17), ఆలకుంట కృష్ణవేణి (17), సీమర భవాని (17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. కాగా బుధవారం ఉదయం గ్రామంలోని శ్రీబంగారు మైసమ్మ ఆలయానికి వెళుతున్నట్లు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల వద్ద వారి స్నేహితుల […]

కీసర: కీసరలో ముగ్గురు ఇంటర్ చదువుతున్న విద్యార్ధునులు అదృశ్యమైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండల కేంద్రమైన కీసరలోని నందిని నగర్ కాలనీకి చెందిన ఆలకుంట గీత (17), ఆలకుంట కృష్ణవేణి (17), సీమర భవాని (17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. కాగా బుధవారం ఉదయం గ్రామంలోని శ్రీబంగారు మైసమ్మ ఆలయానికి వెళుతున్నట్లు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల వద్ద వారి స్నేహితుల వద్ద వెతికిన జాడ తెలియలేదు. దీంతో గురువారం గీత తండ్రి ఆలకుంట కరుణ కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Intermediate students disappear in Kisara

Telangana Latest News

Related Stories: